భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్లో గెలిచినా, ఓడినా సంచలనమే. తాజాగా వరల్డ్ కప్ లో మహిళా క్రికెటర్లు సాధించిన విజయం దేశవ్యాప్తంగా క్రికెట్ క్రేజ్ ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో మహిళా క్రికెటర్లపై ఇప్పటికే
భారత్ లో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెట్లో గెలిచినా, ఓడినా సంచలనమే. తాజాగా వరల్డ్ కప్ లో మహిళా క్రికెటర్లు సాధించిన విజయం దేశవ్యాప్తంగా క్రికెట్ క్రేజ్ ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో మహిళా క్రికెటర్లపై ఇప్పటికే పలు రాష్ట్రాలు కాసుల వర్షం కురిపించాయి. ఇదే క్రమంలో ఇప్పుడు బీసీసీఐ కూడా మహిళా క్రికెటర్లకు డబుల్ బొనాంజా ప్రకటించింది. వారి మ్యాచ్ ఫీజుల్ని అమాంతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
తాజాగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో దేశవాళీ క్రికెట్లో మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజుల్ని భారీగా పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుకు 10 వేల ఫీజుల స్ధానంలో ఇప్పుడు ఏకంగా 25 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. క్రికెట్‌ను వృత్తిపరమైన కెరీర్‌గా కొనసాగించాలనుకునే మహిళలకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
గతంలో సీనియర్ మహిళా క్రికెటర్లకు రోజుకు రూ.20,000 మ్యాచ్ ఫీజు చెల్లించేవారు. ఇప్పుడు దీనిని రోజుకు రూ.50,000కు పెంచారు. అయితే ఈ పెరిగిన ఫీజులు ప్లేయింగ్ లెవెన్ (తుది జట్టులో ఉన్న వారు) కు మాత్రమే వర్తిస్తుంది. కొత్త ఫీజు విధానం వల్ల తుది జట్టులో క్రికెటర్లతో పాటు రిజర్వ్‌లుగా పేరున్న స్క్వాడ్ సభ్యులకు కూడా ప్రయోజనం దక్కనుంది. సీనియర్ రిజర్వ్ క్రికెటర్ ఫీజును రోజుకు రూ.25,000కు పెంచారు. ఇది ప్రస్తుతం రూ.10,000గా ఉంది.
మహిళల క్రికెట్ కు పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో బీసీసీఐ ఇలా దేశవాళీ క్రికెటర్లతో పాటు సీనియర్ క్రికెటర్లకూ ఫీజులు పెంచింది. బీసీసీఐ ఛైర్మన్ గా జై షా పదవీకాలంలో భారతదేశంలో మహిళా క్రికెట్ బలోపేతం చేయడానికి బోర్డు అనేక కీలక సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ స్థాయికి కూడా విస్తరించాయి. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్ గానూ జై షా ఈ సంస్కరణలు కొనసాగిస్తున్నారు. అలాగే బీసీసీఐ కొత్త అధ్యక్షుడు మిథున్ మన్హాస్ కూడా వీటిపై దృష్టిసారించారు.

















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *