పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
[cmsmasters_row][cmsmasters_column data_width=”1/1″][cmsmasters_text]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22, 2023 లో రిలీజైన ఈ మూవీ దాదాపు రూ. 700 కోట్లు రాబట్టి ప్రభాస్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ సీక్వెల్ కోసం అటు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటుగా మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ క్రేజీ పోస్టు పెట్టింది. ఈ మూవీకి రెండేళ్లు పూర్తయినట్లు పేర్కొంది. త్వరలోనే నెక్స్ట్ చాప్టర్ పై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది.
ఇక గతంలో ‘సలార్: శౌర్యంగపర్వం’ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సలార్-2 తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు తాను రాసుకున్న స్క్రిప్ట్స లో ఇదే అత్యుత్తమమైనదని వివరించారు. ప్రేక్షకులు ఊహించని స్థాయిలో సలార్ మూవీ సీక్వెల్ ఉంటుందని నీల్ తెలిపారు. ఇక ప్రభాస్ అటు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదలకు సిద్ధం అయింది. అలాగే ఫౌజీ, స్పిరిట్, కల్కి-2 చిత్రాలు చేయాల్సి ఉంది. మరి సలార్ 2 ఎప్పుడు ఉంటుందో చూడాలి.https://x.com/hombalefilms/status/2002966515407352275?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2002966515407352275%7Ctwgr%5E10d4a489482f734d231b91cd72fb19d59085bf02%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.oneindia.com%2Fentertainment%2Fsalaar-turns-2-prabhas-blockbuster-completes-two-years-sequel-hype-peaks-464862.html
అలాగే ప్రశాంత్నీల్సైతం ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌తో జిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చిత్రీకరణ ప్రారంభం అయింది. ఇందులో ఎన్టీఆర్ శక్తిమంతమైనపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2026 జూన్25న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత ప్రశాంత్నీల్కేజీఎఫ్ చాప్టర్ 3 తెరకెక్కిస్తారా..? లేక సలార్ 2 తెరకెక్కిస్తారా.. ? చూడాలి.
[/cmsmasters_text][/cmsmasters_column][/cmsmasters_row]

















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *