నూతన వధూవరులకు TTD అద్భుత అవకాశం..!!

నూతన వధూవరులకు TTD అద్భుత అవకాశం..!!

Aliquam quam elit, mollis at odio gravida, ultrices pulvinar justo. Vivamus eleifend mollis dolor, et ornare.

Tirumala: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని డిసైడ్ చేసారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ ఖరారు చేసారు. వైకుంఠ ఏకాదశితో పాటుగా కొత్త సంవత్సరం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, నూతన వధూ వరుల కు టీటీడీ అరుదైన అవకాశం కల్పించింది.

టీటీడీ ఇప్పటికే కొత్తగా పెళ్లైన వారి కోసం ప్రత్యేకంగా నిర్ణయాలు అమలు చేస్తోంది. నూతన వధువరులు కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇంతటి విశిష్టమైన వివాహానికి కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరుని ఆశీస్సులు అందితే అంతకన్నా కావాల్సిందేముంది. ఈ మహత్తర అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కల్పిస్తోంది. నూత‌నంగా వివాహం చేసుకునే పెళ్లి కుమారై, పెళ్లి కుమారుడికి శ్రీ‌వారి దీవెనలతో అక్షింతలు, కుంకుమ, కంకణం, శ్రీవేంకటేశ్వర ‌స్వామి, శ్రీపద్మావతీ అమ్మ‌వారి ఫోటోలతో కూడిన ఆశీర్వచనం పత్రిక, ‘కల్యాణ సంస్కృతి’ పుస్తకం టీటీడీ అందిస్తోంది. ప్ర‌తి ఏడాది శుభ‌లేఖ పంపిన‌ ల‌క్ష‌కు పైగా వ‌ధువ‌రుల‌కు శ్రీ‌వారి దీవెనలతో క‌ల్యాణం జ‌రుగుతోంది. ఇందుకు చేయాల్సింది పూర్తి చిరునామాతో వివాహ శుభలేఖను పంపాలి.

వధువరుల కల్యాణంలో మొదటి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుండి రక్షించే రక్షాబంధనమైన కంకణాలను వరుడి కుడిచేతికి, వధువు ఎడమ చేతికి ధరింపచేస్తారు. ఇందు కోసం శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో సకల శుభాలు కోరుతూ కుంకుమ, కంకణధారణకు కంకణం పంపుతారు. ఇక..వివాహంలో భాగంగా చివరిగా తలంబ్రాలు పోసే ఆచారం ఉంది. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని, సత్కర్మలు పెంపొందాలని, దాంపత్యం ఫలప్రదం కావాలని, భార్యాభర్తలు పరస్పరం ప్రీతిపాత్రులు కావాలని, సిరిసంపదలు కలగాలని టిటిడి కోరుతూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపుతోంది. నూతన వధువరులకు వివాహ వ్యవస్థ గురించి తెలిపేందుకు “కల్యాణ సంస్కృతి” పేరిట ఓ పుస్తకాన్ని, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీ పద్మావతీల ఫోటోలతో కూడీన వేద ఆశీర్వచన పత్రికను టిటిడి కార్యనిర్వహణాధికారి పేరిట పంపుతారు.

టీటీడీ ప్రతి సంవత్సరం ల‌క్ష‌కు పైగా నూతన జంటలకు శ్రీవారి అశీస్సులు అందిస్తున్నారు. శ్రీవారి ఆశీస్సులు పొందగోరు నూతన వధూవరులు త‌మ పూర్తి చిరునామాతో “కార్యనిర్వహణా అధికారి, టిటిడి పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి – 517501” పేరిట వివాహ పత్రికను పంపాలి. మరిన్ని వివరాలకు కాల్ సెంటర్ నెం.155257 సంప్రదించాలని సూచిస్తున్నారు.

 

 

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos