ఎక్సైజ్ సిఐ స్వప్న ఫైల్ ఫోటో... కల్లు కాంట్రాక్టర్ చేత ఫోన్ చేయించి మరీ బెదిరింపులు... సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని వ్యక్తి ఆమె జోలికి వెళ్లొద్దు... గతంలో నీపై సిపికి పిర్యాదు చేసిందని..మళ్ళీ చేస్తుందని దమ్కి.. విలేకరుల మీద కేసు కూడా అవుతున్నాయని బెదిరింపు... ఆమెతో ఎందుకు కక్ష్య పెంచుకుంటున్నావని మందలింపు... ఎదురు ప్రశ్నించడంతో తోక ముడిచిన కల్లు కాంట్రాక్టర్... అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పరిశోదనకు అడ్డుపడే ప్రయత్నం... మీడియా ముందుకు రాని
ఎక్సైజ్ సిఐ స్వప్న ఫైల్ ఫోటో…
- కల్లు కాంట్రాక్టర్ చేత ఫోన్ చేయించి మరీ బెదిరింపులు…
- సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని వ్యక్తి ఆమె జోలికి వెళ్లొద్దు…
- గతంలో నీపై సిపికి పిర్యాదు చేసిందని..మళ్ళీ చేస్తుందని దమ్కి..
- విలేకరుల మీద కేసు కూడా అవుతున్నాయని బెదిరింపు…
- ఆమెతో ఎందుకు కక్ష్య పెంచుకుంటున్నావని మందలింపు…
- ఎదురు ప్రశ్నించడంతో తోక ముడిచిన కల్లు కాంట్రాక్టర్…
- అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పరిశోదనకు అడ్డుపడే ప్రయత్నం…
- మీడియా ముందుకు రాని సిఐ స్వప్న,కల్లు కాంట్రాక్టర్ చేత బెదిరింపులు…
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 08 :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జనవరి 23 తారీఖున గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, స్మగ్లర్లు కారుతో గుద్దడంతో మృతి చెందినదని అందరికి తెలిసిన విషయము.ఈ ఘటనకు సంబంధించి సిఐ స్వప్నపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ,ఘటన జరిగిన మరుసటి రోజున ఎక్సైజ్ కానిస్టేబుల్ అసోసియేషన్ తలపెట్టిన ధర్నాలో కొన్ని విషయాలను పసిగట్టిన “కబురు న్యూస్” వాస్తవలను వెలికి తీసే ప్రయత్నం ప్రారంభించింది.ఈ ఘటనకు సంబంధించి స్థానిక ఎక్సైజ్ ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కార్యాలయానికి పలు మార్లు వివరణ కొరకు వెళ్ళగా అందుబాటులోకి రాలేదు..రాకపోగా కబురు న్యూస్ ఫోన్ నెంబరును బ్లాకులో పెట్టడం మరో విశేషం,గమనార్హం.ఓ మహిళా అధికారి అయి ఉండి బెదిరించే స్థాయికి ఎదిగిందంటే,అమాయకురాలు కానిస్టేబుల్ సౌమ్య ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది.సిఐ స్వప్న కల్లు కాంట్రాక్టర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం కూడా తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.సిఐ స్వప్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని మనిషని సదరు కల్లు కాంట్రాక్టర్ బెదిరించిన తీరు లోలోపల వారిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలను బట్టబయలు చేసింది.నీపై గతంలో సిపి సాయి చైతన్యకు పిర్యాదు చేసిందని,తాజాగా ఇప్పుడు కూడా చేస్తుందని బెదించడంలో కబురు న్యూస్ పరిశోదనని అడ్డుకునే ప్రయత్నంలో భాగమే అవుతుంది.మీ విలేకరుల మీద సిపి సాయి చైతన్య కేసులు చేస్తున్నాడని,జాగ్రత్త అంటూ చివరి ప్రయత్నంగా బెదిరింపులకు దిగగా,కల్లు కాంట్రాక్టర్ అయిన నీతో ఫోన్ చేయించడం ఏంటని,సిఐ స్వప్నని మీడియా ముందుకు రావాలంటూ,ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడమేంటని,కబురు న్యూస్ కల్లు కాంట్రాక్టర్ ని పలురకాలుగా ప్రశ్నించడంతో తోక ముడిచాడు.ఇలా సదరు కల్లు కాంట్రాక్టర్ సిఐ స్వప్నను వెనకేసుకురావడంలో ఆంతర్యమేంటో ఇక అందరికి అర్ధమయ్యే ఉంటుంది.గతంలో కూడా ఓ ముఖ్యమైన పండుగ రోజున ఎక్సైజ్ కానిస్టేబుల్ హమీద్ తో ఫోన్ చేయించి బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ తీకోవాలని కోరగా తిరస్కరించడం జరిగింది.ఎక్సైజ్ సిఐ స్వప్న ఇలా రకరకాలుగా మీడియా ప్రతినిధులను ప్రలోబాలకు గురి చేసి నిబద్దత గల పాత్రికేయులను తనవైపు మలుపుకోవాలనే ఎత్తుగడలు వేస్తూ ఉంటుంది.లొంగపోతే బెదిరింపులకు కూడా వెనకాడదు.చివరకు పోలీసులకు కూడా పిర్యాదు చేస్తుంది..పోలీసులకు పిర్యాదు చేస్తానని బెదిరిస్తే,అలాగైనా తన గురించి ఆలోచించకుండా ఉంటారనే ఓ భ్రమలో ఉంటుంది.మొత్తానికి దీంట్లో భాగంగానే కబురు న్యూస్ ను తన దోవలోకి తెచ్చుకోవాలనే తీవ్ర ప్రయత్నం చేసి విఫలం కావడంతో ఇప్పుడు మౌనం వహించింది.సిఐ స్వప్న కబురు న్యూస్ పై బెదిరింపులకు పాల్పడిన అనంతరం,ఎక్సైజ్ సౌమ్య సంఘటనకు సంబంధించిన విచారణ కబురు న్యూస్ వేగవంతం చేసింది.పలురకాల అనుమానాలకు తావిచ్చే,అమాయకురాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి ఘటనకు సంబంధించి కబురు న్యూస్ కొన్ని వాస్తవాలను త్వరలో ప్రజల ముందుకు తీసుకురాబోతుంది..






















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *