అది ప్రభుత్వ సిమ్..బ్లాకులో పెట్టొద్దు..

అది ప్రభుత్వ సిమ్..బ్లాకులో పెట్టొద్దు..

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి... ఎక్సైజ్ సిఐ స్వప్న కబురు న్యూస్ నెంబర్ బ్లాకులో పెట్టడం తప్పు బట్టారు... ఎక్సైజ్ డిసి కూడా పెట్టారనగా,ఎవరైనా సరే అలా పెట్టొద్దన్నారు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 26 : అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి,నగర ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.సౌమ్య ఘటనలో అనుమానాలు తీవ్ర తరుణం అవుతున్న నేపథ్యంలో సమాచారణ

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి…

ఎక్సైజ్ సిఐ స్వప్న కబురు న్యూస్ నెంబర్ బ్లాకులో పెట్టడం తప్పు బట్టారు…

ఎక్సైజ్ డిసి కూడా పెట్టారనగా,ఎవరైనా సరే అలా పెట్టొద్దన్నారు…

కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 26 :

అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి,నగర ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టడాన్ని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.సౌమ్య ఘటనలో అనుమానాలు తీవ్ర తరుణం అవుతున్న నేపథ్యంలో సమాచారణ సేకరణ నిమిత్తం,గంజాయి స్మగ్లర్ల దాడి ఘటనలో బాధ్యత గల అధికారిగా ఉన్న సిఐ స్వప్న,అందుబాటులోకి రాకపోవడమే కాకుండా ఫోన్ కట్ చేస్తూ,కబురు న్యూస్ ఫోన్ నెంబర్ బ్లాకులో పెట్టిందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లి, సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయన ముందు రెండు మూడు పర్యాయాలు ఫోన్ చేయగా బ్లాకులో పెట్టిన విషయాన్ని గమనించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ అధికారి అయి ఉండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగగా ఇకపై అలా జరుగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.అధికారులకు ప్రభుత్వం జారీ చేసిన సిమ్ కార్డు ప్రజలకు అదుబాటులో ఉండటానికెనని,ఎవరైనా సరే ప్రభుత్వం అందజేసిన సిమ్ కార్డు ఎట్టి పరిస్థితుల్లో బ్లాకులో పెట్టడం చట్టవిరుద్దమని పేర్కొన్నారు.మీడియా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు.అది ప్రత్యక్షంగా నైనా ఫోనులోనైనా సరే తగిన విదంగా స్పందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని , ఈ సందర్బంగా గుర్తు చేశారు.తప్పకుండా తగిన విదంగా చర్యలు తీసుకొని మరోసారి అలా పునరావృతం కాకుండా చూస్తామని కబురు న్యూస్ కు తెలిపారు.ఇంత జరిగినా సిఐ స్వప్న చర్యల్లో ఏమాత్రం మార్పు కనిపించకపోగా కబురు న్యూస్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు అమాయకురాలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి తగిన విచారణలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ముఖ్య అధికారి అయిన సిఐ స్వప్న నేటి వరకు మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం.ఇకనైనా రాష్ట్రస్థాయి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కానిస్టేబుల్ సౌమ్య ఘటనకు సంబంధించి ఏలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడవలసిందే మరి…

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!