ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..

ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర… స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది… ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు… తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు… అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…?? ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది… ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది… రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఘటనలో ఈ ఆటోదే కీలక పాత్ర…

స్మగ్లర్ల కారుకు ఈ ఆటోనే వేనకనుండి అడ్డుపడింది…

ఆటోతో అడ్డుకోవడంతోనే,సౌమ్యను కారుతో డీ కొట్టారు…

తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో సౌమ్య పైనుండి రెండోసారి వెళ్లిన స్మగ్లర్ల కారు…

అసలు ఈ ఆటోలో ఉన్నది ఎవరు…??

ఎస్ఎచ్ఓ సిఐ స్వప్న,సిబ్బంది ఉండగా, ఈ ఆటో ఎందుకు కీలకమైంది…

ఫిబ్రవరి 07 న ఈ ఆటో రెండవసారి గంజాయితో పట్టుపడింది…

రెండోసారి గంజాయితో పట్టుపడినప్పుడు మహమ్మద్ కరీంఖాన్(సోనూ)యే డ్రైవర్…

పట్టు పడిన మహమ్మద్ కరీంఖాన్ అలియాస్ సోను ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు…??

పట్టుబడ్డ ఆటోని ఎందుకు సీజ్ చేయలేదు…

ప్రతి చిన్న విషయాన్ని మీడియా ముందు పెట్టె ఎక్సైజ్ శాఖ..

ఈ ఆటో విషయాన్ని మీడియా ముందుకు తేకపోవడం కారణం…

సౌమ్య ఘటనలో అసలు విషయాన్ని నీరుగారుస్తున్న ఎక్సైజ్ శాఖ…

కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మార్చి 23 :

నిజామాబాద్ నగర శివారులోని మరుతి సుజుకి ట్రూ వాల్యూ షో రూమ్ వద్ద జనవరి 23 న జరిగిన స్మగ్లర్ల దాడిలో,అమాయకురాలైన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య అకాల మృత్యువుకి TS 16 UB 7250 నెంబరు గల ఆటోనే మూల కారణమన్నది నగ్న సత్యం.స్మగ్లర్లపై దాడి జరిగిన రోజున ఆటోలో స్థానిక గంజాయి స్మగ్లర్లు పాల్గొనడం విశేషం.పనికిరాని చెత్త వ్యూహంలో భాగంగా నిర్మల్ నుండి వచ్చిన గంజాయి స్మగ్లర్లను పట్టివ్వడంలో కీలక పాత్ర పోషించిన,స్థానిక స్మగ్లర్ల ఆటో,కారుకు వెనక భాగంలో అడ్డుపడి పట్టివ్వడమనేది పసిగట్టిన నిర్మల్ స్మగ్లర్లు కోపోద్రిక్తులై,ముందు భాగంలో ఉన్న కానిస్టేబుల్ సౌమ్యను గుద్దేయడం జరిగింది.ఈ ఘటనలో ఆటో ముందు భాగం పూర్తిగా ద్వంసమైంది.ఈ ఆటోలో స్థానిక కరడు గట్టిన గంజాయి స్మగ్లర్ సతీమణితో పాటు ఇంకొందరు పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం.నిర్మల్ స్మగ్లర్ల కారుకు వెనక భాగంలో ఆటో అడ్డు పెట్టడం వల్ల ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ సౌమ్యను గుద్ది వెళ్లిన కారు,తిరిగి రివర్స్ తీసుకునే క్రమంలో మళ్ళీ సౌమ్యపై నుండి రెండోసారి వెళ్లడం జరిగింది.ఈ రకంగా రెండు సార్లు స్మగ్లర్ల కారు గుద్దిన ఘటనలో సౌమ్య తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడింది.నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఎస్ఎచ్ఓ సిఐ స్వప్నతో పాటు ఎనిమిది తొమ్మిది మంది సిబ్బంది ఉండగా,ఈ ఆటో సౌమ్య ఘటనలో కీలక పాత్రను పోషించాల్సిన అవసరమేమిటన్నది తేలాల్సిన అవసరం ఉంది.ఇదే ఆటో రిపేరు అనంతరం ఫిబ్రవరి 07 న గంజాయితో మళ్ళీ పట్టుబడింది. IMG 20260323 WA0004సౌమ్య ఘటన రోజున అదేవిదంగా రెండవసారి గంజాయితో పట్టుబడిన సమయంలో ఆటో డ్రైవర్ గా మహమ్మద్ కరీంఖాన్ అలియాస్ సోనును కూడా పట్టుకోవడం జరిగింది.సోనూ స్టేట్ మెంట్ తీసుకున్న అనంతరం ఆటోతో సహా ఆయనని సుట్టమోలె వదిలి పెట్టారు.లోతుగా జరపాల్సిన విచారణ మాత్రం గాలికొదిలేశారు.సౌమ్య ఘటనలో ధ్వంసమైన ఆటో రిపేరు అనంతరం రెండవసారి గంజాయితో పట్టుపడిన సమయంలో అత్యంత కీలకమైన ఈ అంశాన్ని మీడియా ముందుకు తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించిన ఎక్సైజ్ శాఖ పట్ల తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.నిర్మల్ గంజాయి స్మగ్లర్లు నిజామాబాద్ నగరానికి రావడం.ఆ ఘటనలో స్థానిక గంజాయి స్మగ్లర్లు పాల్గొనడం వెనుక అందరికి తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.సౌమ్య మృతి ఘటనలో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ వాస్తవాలు దాచి కేసును తప్పుదోవ పట్టించి,నీరుగార్చే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు పలురకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సౌమ్య ఘటనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో న్యాయ విచారణ జరిపి నిజా నిజాలు,ఈ మిస్టరీని నిగ్గు తెల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!