* జన్నేపల్లిలో కొందరి దరఖాస్తులపై మోకుదెబ్బ నాయకుల అభ్యంతరం.. * నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేస్తే రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు వినతి.. * గీత వృత్తితో సంబంధం లేని వారికి లైసెన్సులు ఇవ్వొద్దని విజ్ఞప్తి.. * నిబంధనలకు విరుద్ధంగా జారీ చేస్తే లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్.. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 11 : గీత వృత్తితో సంబంధం లేని,ఆ వృత్తిలో అనుభవం లేని ఇతర కులాలకు చెందిన వ్యక్తులకు టీఎఫ్టీ లైసెన్సులు మంజూరు చేయొద్దని

- * జన్నేపల్లిలో కొందరి దరఖాస్తులపై మోకుదెబ్బ నాయకుల అభ్యంతరం..
- * నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేస్తే రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు వినతి..
- * గీత వృత్తితో సంబంధం లేని వారికి లైసెన్సులు ఇవ్వొద్దని విజ్ఞప్తి..
- * నిబంధనలకు విరుద్ధంగా జారీ చేస్తే లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్..
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 11 :

గీత వృత్తితో సంబంధం లేని,ఆ వృత్తిలో అనుభవం లేని ఇతర కులాలకు చెందిన వ్యక్తులకు టీఎఫ్టీ లైసెన్సులు మంజూరు చేయొద్దని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కోటగిరి అరుణ్‌కుమార్ గౌడ్ కోరారు.నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు మంజూరు చేస్తే వాటిని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం,నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో గీత వృత్తితో సంబంధం లేని కొందరు వ్యక్తులు టీఎఫ్టీ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.గీత వృత్తినే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న గౌడ కుటుంబాలపై ఇలాంటి పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.గీత వృత్తితో సంబంధం లేని వారికి లైసెన్సులు మంజూరు చేయకుండా దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని అరుణ్‌కుమార్ గౌడ్ కోరారు.అర్హత,వృత్తి నైపుణ్యం లేని వారికి లైసెన్సులు ఇవ్వడం వల్ల తమ జీవనోపాధికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని,అలా జరగకుండా చూడాలని ఎక్సైజ్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ విషయాన్ని గతంలోనూ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఇకనైనా స్పందించి గీత వృత్తిదారులకు న్యాయం చేయాలని కోరారు.నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఏవైనా టీఎఫ్టీ లైసెన్సులు జారీ చేసి ఉంటే, వాటిని పునఃపరిశీలించి రద్దు చేయాలని,భవిష్యత్తులో లైసెన్సుల జారీ సమయంలో అర్హతలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలని డిమాండ్ చేశారు.గీత వృత్తిదారుల జీవనోపాధి,సంప్రదాయ వృత్తి ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.వినతిపత్రం ప్రతులను రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ కమిషనర్, గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్లకు పంపినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ జన హక్కుల పోరాట సమితి(మోకు దెబ్బ)ప్రతినిధులు,తదితర గౌడ నాయకులు పాల్గొన్నారు..















1 Comment
పి. Shekar goud
August 11, 2026, 8:15 PMగీతా వృత్తి లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని ఆధార్ లింకు చేయాలి ఎందుకంటే ఒక్కరు రెండు దగ్గర టిసిఎస్ లైసెన్స్ తీసుకుంటున్నారు ప్రభుత్వం ప్రతి ఒక్కదాని ఆధార్ లింక్ చేసినప్పుడు లైసెన్స్ హోల్డర్ కూడా ఆధార్ లింక్ చేయాలి
REPLY