కేసీఆర్, హరీష్ కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు – కీలక పరిణామం, నెక్స్ట్ ఇక..!?

కేసీఆర్, హరీష్ కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు – కీలక పరిణామం, నెక్స్ట్ ఇక..!?

ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్..

ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో సిట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే రివ్యూ కమిటీలోని వారిని సిట్ విచారించింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న జీఏడీ సెక్రటరీ, సీఎస్‌లు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ మరోసారి విచారణకు పిలిచింది. కాగా.. రాజకీయ నేతల పైన సిట్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్.. హరీష్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ విచారణ కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును విచారణ చేస్తున్న సిట్ ఇప్పటికే మాజీ సీఎస్.. ఇంటలిజెన్స్ చీఫ్ ల నుంచి స్టేట్ మెంట్లను రికార్డు చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు విచారణ సమయంలో అనేక అంశాలను రాబట్టింది. ప్రభాకర్ రావు పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ ఇంటలిజెన్స్ అధికారి అనిల్ కుమార్ పేర్లను ప్రస్తావన చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మహేందర్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేసింది. కాగా, ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రి హరీష్ కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్ కు నోటీసులు జారీ అంశం ఈ కేసులో కీలక మలుపుగా మారనుంది. ఈ నెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో.. ఆ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిట్ ఈ కేసులో ముగ్గురు మాజీ ఐఏఎస్‌లతోపాటు మాజీ ఐపీఎస్ అధికారులను సిట్ సాక్షులుగా విచారించింది. మాజీ సీఎస్‌లు సోమేష్ కుమార్, శాంతి కుమారిలను విచారించింది. అలాగే సాధారణ పరిపాలన శాఖ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతోపాటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌ను కూడా విచారించింది. ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా ప్రభాకర్ రావును నియమించడంపై ఐఏఎస్‌లకు సిట్ పలు ప్రశ్నలు సంధించింది.

గత ప్రభుత్వంలో ఈ ముగ్గురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతో పాటు మీడియా ప్రతినిధుల ఫోన్లను సైతం ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తమ దర్యాప్తులో సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావు ఇచ్చిన నెంబర్లను యథావిథిగా హోం శాఖకు ఈ మాజీ ఐపీఎస్ అధికారులు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనుబంధ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసుల వ్యవహారం తో పాటుగా సిట్ తీసుకునే నిర్ణయాల పైన రాజకీయంగానూ ఉత్కంఠ పెంచుతోంది.

 

 

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos