స్థానిక సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపులకు అందుబాటులోకి తేవాలీ ఎకరానికి యూరియా కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలీ జిల్లా కలెక్టర్ కు వినతి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: యూరియా ఆన్లైన్ యాప్ లో మండల యూనిట్ కి బదులుగా రైతులకు అత్యంత చేరువలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లేదా స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టి లైజర్ దుకాణాలను పం పిణీ యూనిట్లుగా మార్చా లని రైతులు, బిజెపి నా యకులు
స్థానిక సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపులకు అందుబాటులోకి తేవాలీ
ఎకరానికి యూరియా కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలీ
జిల్లా కలెక్టర్ కు వినతి

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11:
యూరియా ఆన్లైన్ యాప్ లో మండల యూనిట్ కి బదులుగా రైతులకు అత్యంత చేరువలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లేదా స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టి లైజర్ దుకాణాలను పం పిణీ యూనిట్లుగా మార్చా లని రైతులు, బిజెపి నా యకులు బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారిలు జిల్లా కలెక్టర్ ను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ని మర్యా దపూర్వకంగా కలిసి విన తి పత్రం అందజేసారు.
కేంద్రం ఎరువులు ఇవ్వడానికి సిద్ధం..
రాష్ట్ర ప్రభుత్వ యాప్‌తోనే రైతుల అవస్థలు
దినేష్ పటేల్ కులాచారి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆన్లైన్ ఎరువుల బుకింగ్ యాప్ తో రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొం టున్న సమస్యలను పరి ష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతిప త్రం అందజేసినట్లు జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ యూరియా బుకింగ్ యాప్ కేవలం ఈ రాష్ట్రా నికి మాత్రమే పరిమితమై నదన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సం బంధం లేదు. రాష్ట్ర ప్రభు త్వం ఎంత అడిగితే అం త యూరియాను అందిం చడానికి, ఎరువుల కొరత లేకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. కానీ, పం పిణీ వ్యవస్థలోని లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత విధానంలో యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకునేందుకు ‘మండ లాన్ని’ ప్రమాణికంగా తీసుకోవడం క్షేత్రస్థాయి లో పెద్ద సమస్యగా మా రింది. పంపిణీ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉంటున్నాయి. దీనివల్ల బుక్ చేసుకున్న బస్తాలను తమ గ్రామాలకు తీసుకు వెళ్లడానికి రైతులు అదన పు రవాణా ఖర్చులు భరిస్తూ ఆర్థికంగా నష్టపో తున్నారు. జిల్లాలో వరి నాట్లు ముమ్మరంగా సాగు తున్నాయి. కానీ, ఒక ఎక రానికి ఎన్ని బస్తాల యూ రియాను కేటాయి స్తారనే అంశంపై ప్రభుత్వ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పష్ట త లేదన్నారు. ఇది రైతాం గంలో గందరగో ళానికి దారితీస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ సానుకూలం గా స్పందించి యాప్‌లో ఉన్న సాంకేతిక ఇబ్బందు లను గుర్తించి, ‘మండలం’ యూనిట్‌కు బదులుగా ‘రెవెన్యూ విలేజ్ బేస్ చేసుకుని స్థానికంగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎకరానికి యూ రియా కేటాయింపు లపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, రైతుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూ పించుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో కంచెట్టి గంగాధర్, గద్దె భూమన్న, ప్రమోద్ కుమార్, నక్క రాజేశ్వర్, అనంత్ రెడ్డి, నూతల శ్రీనివాస్, తిరుపతి రెడ్డి, కర్క గంగారెడ్డి , విజయ్ కృష్ణ, బొబ్బిలి వేణు పాల్గొన్నారు









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *