మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సురేష్ అరెస్ట్..!! కబురు న్యూస్,హైదరాబాద్,మే 15 : మహిళా కానిస్టేబుల్‌పై కన్నేసిన ఎస్సై సురేష్ ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడిన విషయం తెలిసినదే.అప్పటికే పెళ్లైన విషయం దాచిన ఎస్సై గుడిలో బొట్టు పెట్టి ‘మనిద్దరికీ పెళ్లైంది’ అంటూ మోసానికి పాల్పడ్డాడు.నమ్మించి భౌతికంగా సుఖానికి దగ్గరయ్యాడు.తర్వాత ఎస్సై అసలు నిజం బయటపడటంతో మహిళా కానిస్టేబుల్ షాక్ కు గురయ్యింది.“భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటా”
మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సై సురేష్ అరెస్ట్..!!
కబురు న్యూస్,హైదరాబాద్,మే 15 :
మహిళా కానిస్టేబుల్‌పై కన్నేసిన ఎస్సై సురేష్ ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడిన విషయం తెలిసినదే.అప్పటికే పెళ్లైన విషయం దాచిన ఎస్సై
గుడిలో బొట్టు పెట్టి ‘మనిద్దరికీ పెళ్లైంది’ అంటూ మోసానికి పాల్పడ్డాడు.నమ్మించి భౌతికంగా సుఖానికి దగ్గరయ్యాడు.తర్వాత ఎస్సై అసలు నిజం బయటపడటంతో మహిళా కానిస్టేబుల్ షాక్ కు గురయ్యింది.“భార్యకు విడాకులు ఇచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటా” అంటూ నమ్మబలికించి రెండేళ్లు కాలయాపన.ఈలోపు గర్భం దాల్చిన మహిళా కానిస్టేబుల్ ను
మాయమాటలతో అబార్షన్ చేయించిన ఘనుడు ఎస్సై సురేష్.పెళ్లి చేసుకోమంటే “నేను ఎస్సై,నిన్నెలా పెళ్లి చేసుకుంటా?” నంటూ ఎదురుతిరగడంతో
ఏప్రిల్ 1న కూకట్పల్లి పీఎస్‌లో బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది.కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఎస్సై సురేష్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరార్ అయ్యాడు.నెలన్నర గాలింపుల తర్వాత చివరికి ఎస్సై సురేశ్ పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యాడు.అనంతరం కూకట్పల్లి పోలీసులు రిమాండుకు తరలించారు.లైంగిక దాడి కేసుతో ఎస్సై సస్పెండ్ అయి “ప్రేమ పేరుతో మోసం చేయడంతో చివరకు ఎస్సై సురేష్ కటకటాల పాలయ్యాడు.!!










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *