కేంద్రీయ విద్యాలయం స్థాపనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

విద్యార్థుల భవిష్య త్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం.. కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్‌లోనే 10 ఎకరాల భూమి కేటాయించాలి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి ఇతర చోట ప్రతిపాదించండి సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20: జగిత్యాల కేంద్రీయ విద్యా లయానికి చెల్గల్‌లో నే 10 ఎకరాల భూమి కేటాయిం చాలనీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ

విద్యార్థుల భవిష్య త్తుతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం..

కేంద్రీయ విద్యాలయానికి చెల్గల్‌లోనే 10 ఎకరాల భూమి కేటాయించాలి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి ఇతర చోట ప్రతిపాదించండి

సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20:

WhatsApp Image 2026 05 20 at 9.14.22 AM 1

జగిత్యాల కేంద్రీయ విద్యా లయానికి చెల్గల్‌లో నే 10 ఎకరాల భూమి కేటాయిం చాలనీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ రాశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటె డ్ స్కూల్ కి ఇతర చోట ప్రతిపాదించాలని అన్నా రు. జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం స్థాపన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరి స్తోందని నిజా మాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి చల్గల్ లోని వాలాంతరీ కి చెందిన గల 10 ఎకరాల భూమిని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కేటాయించారని, ఈ భూమిని కేంద్రీయ విద్యా లయ పేరిట బదలా యిం పు చేయాలనీ ఎంపీ లేఖ లో పేర్కొన్నారు. కేవీఎస్ నిబంధనల ప్రకారం కనీ సం 5 ఎకరాల భూమి అ వసరం ఉండగా, ప్రభు త్వం కేవలం 2 ఎకరాల భూమిని మాత్రమే ఆమో దించడం దురదృష్టకర మని విమర్శించారు.
చెల్గల్ గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం 10 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం, కేంద్రీయ విద్యాలయానికి మాత్రం సరైన భూమి ఇవ్వకపో వడం విద్యార్థుల భవిష్య త్తుతో చెలగాటమా డట మేనని ఎంపీ అన్నారు. నర్సింగపూర్ సమీపంలో ప్రతిపాదించిన స్థలం రహ దారి, రవాణా సౌక ర్యాలు లేకపోవడంతో పాటు చెత్త నిల్వ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల విద్యాసం స్థకు పూర్తిగా అనర్హమని పేర్కొన్నారు. చెల్గల్ గ్రా మంలోని 10 ఎకరాల భూమిని వెంటనే కేంద్రీయ విద్యాలయానికి కేటా యించాలని, లేకపోతే జగి త్యాల విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!