కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 09 : నిజామాబాద్ జిల్లాలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ,ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ,పోలీసులకు సవాలుగా మారుతున్నారు.ఇటీవల డిచ్పల్లిలో మూడు ఇండ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు తాజాగా సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.స్థానికంగా ఉండే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాదుకు
- కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు…
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 09 :
నిజామాబాద్ జిల్లాలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ,ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ,పోలీసులకు సవాలుగా మారుతున్నారు.ఇటీవల డిచ్పల్లిలో మూడు ఇండ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు తాజాగా సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.స్థానికంగా ఉండే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాదుకు వెళ్ళగా,ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించారు.ఇంట్లో నుంచి సుమారు 30 తులాల బంగారం,ఇతర వస్తువులు చోరీకి పాల్పడినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓ హరిబాబు,సిసిఎస్,స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.దొంగలు ఇంట్లో ఉన్న సిసి కెమెరాలకు సంబంధించిన డిడిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు.స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలును పరిశీలించగా బైక్ పై వచ్చిన ముగ్గురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *