మేమింతే! ……ఎవరి మాట వినం

మేం చెప్పిందే వేదం.. ఇది ఎగ్జిబిషన్ సొసైటీ తీరు.. అధికారికంగా 12వ తేదీ వరకే ఎగ్జిబిషన్ కు.. అనుమతి కానీ ఇప్పటివరకు కొనసాగుతున్న వైనం.. ఎంట్రీ టికెట్ మాత్రమే లేదు… ప్రస్తుతం పార్కింగ్ టికెట్ తీసుకుంటున్న వైనం.. విద్యుత్ కాంతుల మధ్య కొనసాగుతున్న ఎగ్జిబిషన్.. ఉమ్మడి జిల్లా జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ రూటే సపరేటు! అధికారికంగా ఈనెల 12 వరకు

మేం చెప్పిందే వేదం..

ఇది ఎగ్జిబిషన్ సొసైటీ తీరు..

అధికారికంగా 12వ తేదీ వరకే ఎగ్జిబిషన్ కు.. అనుమతి

కానీ ఇప్పటివరకు కొనసాగుతున్న వైనం..

ఎంట్రీ టికెట్ మాత్రమే లేదు…

ప్రస్తుతం పార్కింగ్ టికెట్ తీసుకుంటున్న వైనం..

విద్యుత్ కాంతుల మధ్య కొనసాగుతున్న ఎగ్జిబిషన్..

WhatsApp Image 2026 06 15 at 8.23.43 PM 1

ఉమ్మడి జిల్లా జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15:

నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ రూటే సపరేటు! అధికారికంగా ఈనెల 12 వరకు మాత్రమే ఎగ్జిబిష న్ నిర్వహించడానికి అనుమతి ఉంది. అంతేకాకుండా విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకని ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం వరకే.. ఎగ్జిబిషన్ నిర్వహించడానికి అనుమతి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఎగ్జిబిషన్ సొసైటీ 12వ తేదీ వరకే అనుమతి ఉన్న ప్రస్తుతం కూడా ఎగ్జిబిషన్లో పలు దుకా ణాలు కొనసాగడమే కాకుండా.. అమూజ్జ్మెంట్ కు సంబంధించి… కొలం బస్, ట్రైన్, పలు ఆహ్లా దాన్ని పంచే రైడ్స్ ఇంకా కొనసాగడం విడ్డూరం.

ఎంట్రీ టికెట్ మాత్రం 12వ తేదీ నుంచి తీసుకోవడం లేదు

ఎప్పటి వరకైతే అనుమతి ఉందో అప్పటి నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ మాత్రం ఎంట్రీ టికెట్ లేకుండా ఉచితంగానే కొనసా గుతుంది. కానీ 12వ తేదీ గడిచి మూడు రోజులు గడుస్తున్న ప్రస్తుతం పలు దుకాణాలు వ్యాపారం కొనసాగడమే కాకుండా… ఆహ్లాదం పంచేలా రైట్స్ కూడా ఇంకను కొనసాగ డం ఏమిటో. ఎగ్జిబిషన్ సొసైటీ తీరు అర్థం కావ డం లేదు. అధికారికంగా 12వ తేదీ వరకే అనుమ తి ఉన్న పట్టింపు లేనట్టు… విద్యుత్ కాంతు ల మధ్య ప్రస్తుతం ఎగ్జి బిషన్ కొనసాగుతుంది.

పార్కింగ్ టికెట్ కూడా ప్రస్తుతం తీసుకుంటున్నారు

ఎగ్జిబిషన్ బందు చేస్తే ప్రస్తుతం ఈ రోజున పార్కింగ్ టికెట్ కూడా సందర్శకుల వద్ద తీసుకోవడం ఏమిటి. సొసైటీ ఈనెల 12వ తేదీ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకోవడం లేదు. కానీ ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకుల నుంచి పార్కింగ్ టికెట్ ప్రస్తుతం తీసుకుంటున్నారు.

విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా!

విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించు కొని పాలిటెక్నిక్ కళాశాల లో విద్యార్థులకు ఇబ్బందుల దృష్టా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం జూన్ 12 వరకే కళాశాల గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వ హించడానికి అనుమతి ఉంది. ప్రస్తుతం 15వ తేదీ గడుస్తున్న ఇంకనూ ఎగ్జి బిషన్ కొనసాగడం ఏమిటో? ఈ ఎగ్జిబిషన్ సొసైటీ తీరుపై జిల్లా కలెక్ట ర్ వెంటనే స్పందించి వి ద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి.

WhatsApp Image 2026 06 15 at 8.23.42 PM

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!