ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి గాడితప్పిన విద్యా వ్యవస్థను వెంటనే గాడిలో పెట్టాలి ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీ ర్యం చేస్తుందని, పలు ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసు కోవాలని ఏబీవీపీ ఇందూ ర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు.
ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి
గాడితప్పిన విద్యా వ్యవస్థను వెంటనే గాడిలో పెట్టాలి
ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్
ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23:
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీ ర్యం చేస్తుందని, పలు ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసు కోవాలని ఏబీవీపీ ఇందూ ర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ పేరుతో 23000 ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కుట్రపై, ప్రవేట్ విద్యాసం స్థల ఆగడాలపై నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతమైంది.ఈ సంద ర్బంగా ఇందూర్ విభాగ్ కన్వి నర్ కైరి శశిoధర్ మాట్లా డు తూ.. ప్రభుత్వ పాఠశాలల ఎత్తివే తకు కుట్ర చేస్తూ… ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీకి కొమ్ముకా స్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలోమౌలిక వసతులు కల్పించాల ని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి పేద విద్యార్థులకు విద్య ను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రేషనలైజేషన్ పేరుతో 23వేల పాఠశా లలను మూ సేందుకు కంకణం కట్టుకు న్నాడని విమర్శించారు. ఈ నిర్ణ యాన్ని ప్రభుత్వం తక్ష ణమే వెనక్కి తీసుకోవా లని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆర్థిక దోపిడిని నియంత్రించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభు త్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేప డతామని హెచ్చరించా రు.ఈ కార్యక్రమంలో దుర్గ దాస్, కూనల్, సoజయ్, వినయ్, రాజకుమార్, రాజేష్, చింటూ, యోగేష్, చరణ్, రాజు, రితేష్, రవికిరణ్, బమేష్, లికేష్, మున్నా, అభి తదితరులు పాల్గొన్నారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *