అరటిపండు అందరూ తినచ్చా – మోతాదు..బెస్ట్ టైం..!!

అరటిపండు అందరూ తినచ్చా – మోతాదు..బెస్ట్ టైం..!!

అరటిపండు. ఇందులో పోషాలు.. విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అరటిపండు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజ లు ఉన్నాయి.

అరటిపండు. ఇందులో పోషాలు.. విటమిన్లు, పోషకాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అరటిపండు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజ లు ఉన్నాయి. ఇందులో నేచురల్ షుగర్స్ ఉండటం వలన రీఫైన్డ్ షుగర్స్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. అరటి పండులో కార్బొహైడ్రేట్స్ సమృద్దిగా ఉండటం వలన సులభంగా జీర్ణం అవుతుంది. అయితే.. అరటి పండు తీసుకోవటం పైన కొందరిలో సందేహాలు ఉన్నాయి. డయాబెటక్ తో ఇబ్బంది పడుతున్న వారు.. వయసు మీద పడిన వారు… ఎలాంటి అనారోగ్యం ఉన్నవారు అరటి పండు తినటం పైన ఉన్న సందేహాలకు నిపుణులు సమాధానం ఇస్తున్నారు.

ఎన్నో పోష‌కాలతో నిండిన అర‌టిపండు ఏడాది పొడ‌వునా లభిస్తుంది. అయితే అర‌టి పండు ఏ స‌మ‌యంలో తినాలి..మితంగా తీసుకోవాలా..? మ‌ధుమేహులు అర‌టిపండు తిన‌వ‌చ్చా వంటి ఎన్నో సందేహాలు వెంటాడుతుంటాయి. జీర్ణ‌క్రియ‌, జీవ‌క్రియ‌ల‌ను మెరుగుప‌రిచి శ‌రీరానికి అవ‌స‌ మైన పోష‌కాల‌ను అందించే అర‌టిపండును కొన్ని ప‌ద్ధ‌తుల్లో అంద‌రూ తీసుకోవ‌చ్చ‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అరటి పండు తీపి కారణంగా డయాబెటిక్ రోగులకు సమస్ గా మారుతుందని అంటారు. అరటిపండులో ఉండే చక్కెర కారణంగా డయాబెటిక్ రోగులు దీనిని తినకూడదని చాలా మంది నమ్ముతారు. అరటి పండు తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీని వలన బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు అరటి పండు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం ఉంటుంది. దీని కారణంగా డయాబెటిస్ ఉన్నవారు వైద్యుల సలహా మేరకే అరటి పండు తీసుకోవటం మంచింది.

ఇక, అరటిపండు లంచ్‌, డిన్న‌ర్ స‌మ‌యంలో అర‌టి పండ్ల‌ను తీసుకోరాద‌ని, లంచ్, డిన్న‌ర్ మ‌ధ్య స్నాక్స్ త‌ర‌హాలో బ‌నానాను తీసుకోవ‌చ్చ‌ని న్యూట్రిష‌నిస్ట్ లు సూచిస్తున్నారు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో అర‌టి పండును తింటే మిగిలిన రోజంతా క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేసే వెసులుబాటు ఉంటుంద‌ని అన్నారు. అలాగే ఖాళీ కడుపుతో అరటి పండ్లు తినడం వల్ల శరీరంలో పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల వికారం లేదా వాంతులవుతాయి. దీంతో ఖాళీ కడుపుతో అరటి పండ్లు తీసుకోకూడదు. ఇక మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు సైతం అరటి పండ్లు తినకపోవడం మంచిది. వాటిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాలపై మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో ఈ సమస్యతో ఇబ్బంది పడే వారు అరటి పండ్లు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. అయితే, పరిమితి మేరకు తీసుకోవటం ద్వారా సమస్యలు ఉండవని.. సహజసిద్దమన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos