చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం... గొంతు కోసి కాళ్లు నరికి మహిళ హత్య... కబురు న్యూస్,రంగారెడ్డి,మే 28 : ఆభరణాలపై అత్యాశతో మానవత్వాన్ని మింగేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కలకలం రేపింది.కడియాలు,చెవి కమ్మల కోసం ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి,ఆమె కాళ్లను నరికేసిన అమానుష ఘటన సమాజాన్ని కలచివేసింది.పసిడి కోసం ప్రాణాలనే బలి తీసుకున్న ఈ మృగత్వం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పోలీసుల వివరాల ప్రకారంగా..చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి అనుబంధ
- చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం…
- గొంతు కోసి కాళ్లు నరికి మహిళ హత్య…
కబురు న్యూస్,రంగారెడ్డి,మే 28 :
ఆభరణాలపై అత్యాశతో మానవత్వాన్ని మింగేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కలకలం రేపింది.కడియాలు,చెవి కమ్మల కోసం ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి,ఆమె కాళ్లను నరికేసిన అమానుష ఘటన సమాజాన్ని కలచివేసింది.పసిడి కోసం ప్రాణాలనే బలి తీసుకున్న ఈ మృగత్వం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పోలీసుల వివరాల ప్రకారంగా..చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామం ధర్మసాగర్‌కు చెందిన ఎరుకుల మైసమ్మ(48) కొన్నేళ్ల క్రితమే భర్తను కోల్పోయి,కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.ఆమె కొడుకు సురేశ్‌కు వివాహం కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మైసమ్మ తిరిగి ఇంటికి రాలేదు.బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలు మైసమ్మేనని గుర్తించారు.దీంతో ఈ ఘటననను చూసిన స్థానిక ప్రజలు మానవత్వం మంటగలిసిందని కంట తడి పెట్టారు..ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షగించాలని కోరారు..



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *