బిఆర్ఎస్ చేసిన పాపాలే ఈ రాష్ట్రానికి ..శాపాలు

ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి… మొసలి కన్నీరు కారుస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: బిఆర్ఎస్ చేసిన పాపాలే ఈరాష్ట్రానికి ..శాపాలుగా మారాయని… వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మానాల

ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే..

ప్రజలను తప్పుదోవ పట్టించడానికి… మొసలి కన్నీరు కారుస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి

మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

WhatsApp Image 2026 07 15 at 3.00.04 PM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15:

బిఆర్ఎస్ చేసిన పాపాలే ఈరాష్ట్రానికి ..శాపాలుగా మారాయని… వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మానాల మోహన్ రెడ్డి మాట్లా డారు.పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు.ప్రశాంత్ రెడ్డి నువ్వు చేసే తప్పులు ఆకాశం పై ఉమ్మేస్తే నీపైనే పడుతదని మర్చిపోయి తప్పుల మీద తప్పులు చేస్తున్నావనీ ప్రశాంత్ రెడ్డి ని విమర్శించారు. భీమ్ గల్‌లో వెజిటబుల్‌ మార్కె ట్‌కు 2021లో, వంద పడ కల ఆసుపత్రికి 2022లో శంకుస్థాపనలు చేశారని మానాల మోహన్‌రెడ్డి గుర్తుచేశారు. ఆయా పను లకు పునాది వేసిన తర్వా త దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అధి కారంలో ఉండి కూడా వాటిని ఎందుకు పూర్తి చేయలేరని మానాల సూ టిగా ప్రశ్నించారు.పనులు జరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా అబద్దాలు చెబు తూ ప్రజలకు దగ్గరికి వెళ్లా లని చూస్తున్న ఈ వ్యవహా రం ఏదైతే ఉందో అది నీ అజ్ఞానానికి అవివేకానికి ఇదొక మచ్చుతునక అని మానాల దుయ్యబట్టారు.

డిపో పై మాట్లాడే నైతిక హక్కు లేని ప్రశాంత్ రెడ్డి కి లేదు

17-09-2023 అంటే ఎన్నికల నోటిఫికేషన్ కి వారం రోజుల ముందు హడావుడిగా శంకుస్థాపన చేశారని మానాల తెలి పారు. ఎన్నికల కోసం ఆడిన డ్రామా అని మా నాల ఆరోపించారు. ప్రజల సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని ఓట్లు దండుకో వడానికి చేసిన ప్రయత్నం ఆయన లక్ష్యం నెరవేరింది తప్ప ప్రజల ఆకాంక్షల నెరవేరకపోవడం దుర దృష్టకరమైన విషయమ నీ మానాల మండిపడ్డారు.

వెజిటే బుల్ మార్కెట్ మీ పాలనలో ఎందుకు ప్రారంభించలేదు..

2021 లో శంకుస్థాపన చేసినటువంటి వెజిటే బుల్ మార్కెట్ నువ్వు ఉన్న క్రమంలోనే రెండు న్నర సంవత్సరాలలో ఎందుకు పూర్తికాలేదు చెప్పాలనీ ప్రశ్నించారు. ఎలక్షన్ల కోసమే చేసిన శంకుస్థాపనలకు నువ్వు చేసిన పాపానికి ఆ పాపా న్ని మేం భరిస్తూ ఈరోజు వంద పడకలు..నీ కాలం లో పనిచేసినటు వంటి రూ.3 కోట్ల బిల్లు పెండింగ్లో ఉంటే మా ప్రిసిసి ప్రెసిడెం ట్ చొరవతో రూ.3 కోట్ల బిల్లు పేమెంట్స్ చేపించి పనులు ప్రారంభించిన ఘనత మహేష్ కుమార్ గౌడ్ ది అని మానాల నొక్కి చెప్పారు.ఆ పని కొనసాగుతూనే ఉంది ఇంకా రూ.4 కోట్ల బిల్లు అయింది. ఆ నాలుగు కోట్ల బిల్లు ఇప్పించడానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తో మాట్లాడి క్లియర్ చేయించే ప్రయత్నంలో మేము ఉంటే కల్లబొల్లి మాటలతో ప్రజలని తప్పు దోవ పట్టిస్తుంటే నిన్ను ఏమనాలి ఏమైనా అంటే కాంగ్రెస్ వాళ్ళు నా మీదికి వస్తున్నారు… నా ఇంటి మీదికి వస్తున్నారు అంటు న్నావ్ …ఇదేం పద్ధతి అని మానాల ప్రశ్నించారు. పది సంవత్సరాలు అధికారం లో ఉన్నది నువ్వు.. ప్రారం భించిన నువ్వు బస్సు డిపో గురించి మాట్లాడ తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్ అభివృద్ధికి రూ. 28 కోట్లతో పనులు కొనసాగు తున్నాయి. మా పిసిసి ప్రెసిడెంట్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సార ధ్యంలో భీంగల్, బాల్కొం డ నియోజకవర్గ అభి వృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో పూర్తిగా నిర్ల క్ష్యం చేసి ఇప్పుడు అభి వృద్ధిపై మాట్లాడమే మిటి అని ప్రశ్నించారు. ప్రజల ను తప్పుదోవ పట్టించడా నికి వేముల ప్రశాంత్ రెడ్డి మొసలి కన్నీరు కారు స్తున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మార్కె ట్ కమిటీ చైర్మన్ లు పాలె పు నర్సయ్య కొత్తింటి ము త్యం రెడ్డి వైస్ చైర్మన్ సుం కెట బుచ్చన్న మండల అధ్యక్షుడు బోనగిరి భా స్కర్ మాజీ అధ్యక్షుడు సుంకెట రవి జిల్లా కార్య దర్శి మురళి జిల్లా నాయ కులు తిప్పి రెడ్డి శ్రీనివాస్ పడిగెల ప్రవీణ్ సర్పంచు లు రేవతి గంగాధర్ శైలేం దర్ అశోక్ పట్టణ అధ్య క్షుడు సల్లూరి గణేష్ బుచ్చిమల్లయ్య నిమ్మ రాజేంద్రప్రసాద్ జైడి శ్రీని వాస్ రాములు నాయ క్ మనోహర్ నరేందర్ రిక్వి త్ శ్రీకాంత్ రాజేశ్వర్ బాల య్య పూజారి శేఖర్ రాజే ష్ షాదుల్లా రమేష్ భూమే ష్ క్రాంతి జగదీష్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!