అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. ఆసుపత్రి, బస్ డిపో సాధనకై దీక్ష.. పోలీసుల పహారాలో స్వగృహంలోనే ఎమ్మెల్యే వేముల నిరాహార దీక్ష కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా? ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై ప్రజల కోసం కొట్లాడుతానని మా జీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి
అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం..
ఆసుపత్రి, బస్ డిపో సాధనకై దీక్ష.. పోలీసుల పహారాలో స్వగృహంలోనే ఎమ్మెల్యే వేముల నిరాహార దీక్ష
కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా?

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15:
ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై ప్రజల కోసం కొట్లాడుతానని మా జీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఒక రోజు నిరాహార దీక్షకు పూనుకున్న బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డిని బుధవారం ఉదయంపోలీసులు గృహ నిర్బంధం చేసిన విషయం తెలిసిందే. పోలీసుల ఆం క్షల నడుమ ఆయన బుధ వారం తన స్వగృహం లోనే నిరాహార దీక్షను కొన సాగిస్తున్నారు.
శాంతియుతంగా ప్రజా సమస్యల పై దీక్ష చేస్తుం టే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయమెందుకు?
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేస్తుంటే కాంగ్రె స్ ప్రభుత్వానికి భయమెం దుకని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు..గత బీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వం భీంగ ల్ ప్రజల వైద్య అవసరా ల కోసం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని, ఇప్పటికే 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 20- 25 శాతం పనులను పూర్తి చేయాలని గత రెండు న్నరేళ్లుగా అసెంబ్లీలో, భీంగల్ వేదికగా అనేక పోరాటాలు చేసినా ప్రస్తు త ప్రభుత్వం పట్టించు కోవడం లేదని మండిప డ్డారు. అలాగే, గతంలో తమ ప్రభుత్వం భీంగల్ కు తీసుకొచ్చిన బస్ డిపో ను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిందని, దానిని తక్షణమే పునరుద్ధరించా లని డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం…
గృహ నిర్భంధం చేయ డంతో ఇంటి వద్ద నిరా హార దీక్ష కొనసాగిస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కి మద్దతుగా వేల్పూర్ వస్తు న్న నాయకులు, కార్యకర్త లను ఎమ్మెల్యే నివాసం వద్ద వందలాది పోలీస్ లను పెట్టి అరెస్ట్ చేశారు
ఎన్నికల లబ్ధి కోసం తూతూ మంత్రంగా పను లు మొదలు చేసిండ్రు
తమ ప్రభుత్వ హయాం లో భీంగల్ సీసీ రోడ్ల కోసం రూ. 12 కోట్లు మంజూరు చేశామని, అయితే మొన్న టి మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నా యకులు ఎన్నికల లబ్ధి కోసం తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలుపెట్టారని విమర్శించారు. నేటికీ ఆ పనులు పూర్తి కాలేదని, రోడ్ల పై కంకర వేసి వదిలే శారని, కనీసం డాంబర్, సీసీ రోడ్లు వేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భీంగల్ మార్కెట్ పనులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపో యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే గృహ నిర్బంధం?
ప్రజా సమస్యలపై భీంగల్ లో ఒకరోజు నిరాహార దీక్షకు పిలుపునిచ్చానని, దీక్షకు అను మతి కోరు తూ పోలీసులకు ముం దస్తు సమాచారం ఇచ్చా మని ఎమ్మెల్యే తెలిపారు. అయితే పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని చెబుతూ, బుధవారం వేకువజామునే పోలీసులు తన ఇంటిని చుట్టు ముట్టి తనను బయటకు రాకుం డా గృహ నిర్బంధం చేశార ని తెలిపారు. భీంగల్ లో దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్లను, స్టేజిని తొలగిం చడమే కాకుండా, ప్రజలు కార్య కర్తలు కట్టిన ఫ్లెక్సీల ను సైతం పోలీసులు చించివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను అడ్డుకున్నంత మాత్రాన ప్రజా సమస్యల పై పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, తన ఇంట్లో నే సాయంత్రం వరకు దీక్షను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
నిరాహార దీక్షకు.. దండిగా ప్రజల మద్దతు..
ప్రజా సమస్యలపై బాల్కొండ ఎమ్మెల్యే నివా సం వద్ద చేపట్టిన నిరాహా ర దీక్షకు ప్రజలు స్వతం త్రంగా ముందుకు వచ్చి మద్దతు పలికారు. వృద్ధు లు, మహిళలు ప్రజలు దీక్షకు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు.hoose













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *