ఫిర్యాదు చేసిన పట్టించుకోరా? ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారిన విద్యాశాఖ.. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు స్వల్ప ఉద్రిక్తత విద్యాశాఖ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: ప్రభుత్వ నిబంధనలు పాటించకున్న, పలు పాఠ శాలలకు అనుమతు లు లేకున్నా విద్యాశాఖ ఎం దుకు చర్యలు తీసుకోవ డం లేదని విద్యార్థి సం ఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. నిబంధనలు పా టించని ,అనుమతి లేని
ఫిర్యాదు చేసిన పట్టించుకోరా?
ప్రైవేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారిన విద్యాశాఖ..
కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన విద్యార్థి సంఘాలు
స్వల్ప ఉద్రిక్తత
విద్యాశాఖ తీరుపై మండిపడుతున్న విద్యార్థి సంఘాలు..

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15:
ప్రభుత్వ నిబంధనలు పాటించకున్న, పలు పాఠ శాలలకు అనుమతు లు లేకున్నా విద్యాశాఖ ఎం దుకు చర్యలు తీసుకోవ డం లేదని విద్యార్థి సం ఘాల నాయకులు ప్రశ్నిస్తు న్నారు. నిబంధనలు పా టించని ,అనుమతి లేని పాఠశాలలపై విద్యాశాఖ కు ఫిర్యాదు చేసిన పట్టిం చుకోకపోవడం ఏమిటని మండి పడుతున్నారు. పూర్తిగా విద్యాశాఖ ప్రైవే ట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారిపోయా యని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ముకా స్తున్న విద్యాశాఖ అధికా రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, నిబంధ నలు పాటించని పాఠశాల లను వెంటనే సీజ్ చేయా లనీ విద్యార్థి సంఘాలు డిమాం డ్ చేశారు. నిజా మాబాద్ జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారి మం డల విద్యాశాఖ అధికారు లు పూర్తిగా విఫలమ య్యారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ ఎఫ్, ఏఐపిఎస్ యూ, డి ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యం లో విద్యాశాఖ అధికారుల తీరుపై సోమవారం కలె క్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యాశాఖ తీరుపై నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ లోపలికి చొచ్చు కొని వెళ్లేందుకు విద్యార్థి సంఘాలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొంత స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయ కులు మాట్లాడుతూ గత రెండు నెలలుగా అను మ తి లేని పాఠశాలల వివరా లను జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసు కెళ్తున్నప్పటికీ, కేవలం పత్రిక ప్రకటనలకు మాత్ర మే పరిమితమై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవ డం లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన విద్యాశాఖ అధికారులే ప్రైవేట్ కార్పొ రేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమా డుతున్నారని మండిప డ్డారు. జిల్లాలో అనేక పాఠశాలలు అనుమ తులు లేకుండానే కార్పొ రేట్ విద్యాసంస్థలు ప్రచా రాలు జోరుగా చేస్తూ మాయ మాటలు చెబుతూ విద్యా ర్థులను ఆకర్షిస్తున్న ప్పటికీ, వాటిపై చర్యలు తీసుకోవడంలో అధికా రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ విద్యా శాఖ అధికారుల తీరుపై, నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అదే విధంగా విధుల పట్ల విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధి కారుల తీరుపై జిల్లా కలె క్టర్ పూర్తి విచారణ చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టేలా ప్రత్యేక చర్యలు చేపట్టా లని విద్యార్థి సంఘాలు కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, ఏఐపీఎస్ యూ జిల్లా కార్యదర్శి బొడ.అనిల్, డిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జీవన్, ఏ ఎస్ ఎఫ్ జిల్లా అధ్య క్షులు సుబోధ్, ఏఐపీఎస్ యూ జిల్లా సహాయ కార్య దర్శి గోపాల్ సింగ్ ఠాగూ ర్, నాయకులు కుశాల్, రాజు, చక్రి, సునీల్, శివ, వినీత్, రాహుల్ పాల్గొన్నారు.











Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *