అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేయాలి.. గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పని ఆలస్యం పై ఎమ్మెల్యే అసహనం.. 34వ డివిజన్లో పలు కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16: నగరవాసులకు ఎటువం టి అసౌకర్యం కలగకుం డా.. నిరంతరం శానిటేష న్ పనులు కొనసాగించా లని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. మంగళవా రం నగరంలోని 34 వ డివిజన్
అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి
ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రం చేయాలి..
గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పని ఆలస్యం పై ఎమ్మెల్యే అసహనం..
34వ డివిజన్లో పలు కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే ధన్ పాల్…

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 16:
నగరవాసులకు ఎటువం టి అసౌకర్యం కలగకుం డా.. నిరంతరం శానిటేష న్ పనులు కొనసాగించా లని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సూచించారు. మంగళవా రం నగరంలోని 34 వ డివిజన్ లో గల మిర్చి కాంపౌండ్, మార్వా డి గల్లీ, ఓల్డ్ రమేష్ టాకీస్ రోడ్డు తదితర కాలనీలలో పర్యటించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ.. కేవలం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. నిరంతరం డ్రైనేజీ పరి శుభ్రత, మంచినీటి సర ఫరా, వీధి దీపాల పను లను పర్యవేక్షించాలని తెలిపారు. అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పలు గల్లీలో మంచినీటి పైప్లైన్ లీకేజీలు గమ నించి, వాటిని అరికట్టా లని ఆదేశించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యా దులు అందినా … సంబం ధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

గంజ్ కమాన్ వద్ద కల్వర్టు….
గాంధీ గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పూర్తైన నేపథ్యం లో…తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచిం చారు. సంబంధిత కాంట్రా క్టర్ కల్వర్టు మాత్రమే నిర్మించి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. కల్వర్టు ఎత్తుగా నిర్మించి నందునా..రోడ్డుకు సమాం తరంగా చేసి వెళ్ళే బాధ్య త వారిది కాదా అని ప్రశ్నించారు. వీలైనంత తొందరగా వాహన రాకపో కలకు సౌకర్యంగా ఉండే లా చూడాలని ఆదేశించా రు. ఈకార్యక్రమంలో నగ ర మేయర్ ఉమారాణి, స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, బీజేపీ నాయ కులు పవన్ ముందడ పాల్గొన్నారు.









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *