దమ్ము దైర్యం ఉంటే.. ఆధారాలతో నిరూపించు!

👉సీఎంతో సహా మంత్రులు అవినీతి చేశారని ఆరోపణ చేయడం సరికాదు. 👉నీట్ పరీక్ష పేపర్ లీక్ సంగతేంటి? 👉ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా కృషి చేస్తుంది 👉జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 16: సీఎం, మంత్రులు అవినీతి చేశారని ఆరోపణ చేయ డం కాదు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేశారని ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

👉సీఎంతో సహా మంత్రులు అవినీతి చేశారని ఆరోపణ చేయడం సరికాదు.

👉నీట్ పరీక్ష పేపర్ లీక్ సంగతేంటి?

👉ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయంగా కృషి చేస్తుంది

👉జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి

WhatsApp Image 2026 06 16 at 3.29.28 PM 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 16:

సీఎం, మంత్రులు అవినీతి చేశారని ఆరోపణ చేయ డం కాదు.. నీకు దమ్ము ధైర్యం ఉంటే అవినీతి చేశారని ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సో మవారం జిల్లా కేంద్రం లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిం చిన విలేకరుల సమావేశం లో జిల్లా కాంగ్రెస్ అధ్య క్షులు నగేష్ రెడ్డి మాట్లా డారు. సీఎంతో సహా మంత్రులపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ అర వింద్ చేసిన వ్యాఖ్య లను తీవ్రంగా ఖండించారు.

నీట్ పరీక్ష పేపర్ లీక్ సంగతేంటి?

ఒకపక్క కేంద్రంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ తో యువ కులు రోడ్లపైకి వచ్చి ఢిల్లీ లో ధర్నాలు చేస్తున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై విమ ర్శలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం మానుకో వాలని నగేష్ రెడ్డి హితవు పలికారు.

యూరియా యాప్ పై విమర్శించడమేమిటి

యూరియా యాప్ అనేది కేవలం తెలంగాణలో మా త్రమే లేదు అని దేశవ్యా ప్తంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలలో యూరియా యాప్ ఉందనీ రెడ్డి నగేష్ రెడ్డి అన్నారు.దేశంలో నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధి కారంలో ఉంటే మిగతా రాష్ట్రాలలో బిజెపి ఉంది కదా మరి దానిగురించి ఎందుకు మాట్లాడటం లేదు? కేంద్రం ఏ విధంగా రాష్ట్రానికి యూరియా సర ఫరా చేస్తే ఆ విధంగా రైతు లకు రాష్ట్ర ప్రభుత్వం సర ఫరా చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఒకేసారి యూరి యాను రాష్ట్రానికి అందిస్తే జిల్లాలో యూరియా అం దిస్తామని, యూరియా యాప్ ద్వారా ఒక ఎకరా నికి ఒకేసారి రెండు బస్తా లు, మూడు ఎకరాలు ఉన్నవారికి రెండుసార్లు, ఐదు ఎకరాలు ఉన్నవారికి మూడుసార్లు, ఆపై ఉన్న వారికి నాలుగు దశల వారీగా యూరియా అందించడం జరుగు తుందన్నారు. యూరియా యాప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని అన్నా రు. యాప్ గురించి తెలి యని వారి కోసం గ్రామ స్థాయిలో గ్రామపంచాయ తీలలో ఏఈఓలను మండల స్థాయిలో ఏఓల ను పెట్టడం జరిగింద న్నారు.

కాంగ్రెస్ హయాంలో..

కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న ప్పుడు సుమారు 18 సంవత్సరాల క్రితం 2004 నుండి 2014 వరకు క్రూడ్ ఆయిల్ బారిల్ ధర 140 డాలర్లు ఉంటే డీజిల్ 55 రూపాయలు పెట్రోల్ 65 రూపాయలు ఉండేదని ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు ఉంటే పెట్రోల్ డీజిల్ ధరలు మా త్రం విపరీతంగా పెంచుతు న్నారు. లక్షల కోట్లు పేద ప్రజలపై భారం మోపడం జరిగిందని ప్రతి ఇంటికి బైకులు ఉన్నాయని రైతు లకు ట్రాక్టర్లకు డీజిల్ ధరలు పెంచి రైతులను ముంచుతున్నారని ఎక్క డ కూడా రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని ఆయన మండిపడ్డారు.

దేశానికి చేసిన అభివృద్ధి శూన్యం

నరేంద్ర మోడీ 12 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన అభివృద్ధి శూన్య మని నగేష్ రెడ్డి ఆగ్రహం మ్ వ్యక్తం చేశారు. జవహ ర్లాల్ నెహ్రూ దేశానికి స్వా తంత్రం వచ్చినప్పుడు ప్రధానిగా బాధ్యతలు తీ సుకున్నారని ఆ సమయం లో దేశం గుండు పిన్ను కూడా తయారీ చేయలేని స్థితిలో ఉందని కరెం టు రోడ్లు ఉండడానికి ఇల్లు తినడానికి తిండి సరిగ్గా లేని రోజు నుండి 17 సం వత్సరాలు ప్రధానిగా బా ధ్యతలు చేపట్టి దేశాన్ని ప్రపంచ దేశాల స్థాయిలో అభివృద్ధిలో ఎదిగేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కేంద్రంలో బిజెపి అధి కా రంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని నల్ల ధనాన్ని బయటకు తీసి ప్రతి పేదవాని ఎకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా మని ఇప్పటికీ వేయ లేదు అని నగేష్ రెడ్డి అన్నారు.

నిజామాబాద్ పార్ల మెం టు కు ఒక్క రూపాయి కూ డా తీసుకురాలేదుగనీ..

7 ఏండ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క రూ పాయి కూడా తీసుకు రా లేదని రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన నడుస్తున్నా యని పసుపు బోర్డు పేరుకే తీసుకువచ్చారు కానీ దానిలో అధికారులను నియమించలేదు. పసుపు బోర్డు ద్వారా పసుపు కు మద్దతు ధర ఇప్పించడం లో అరవింద్ విఫలమ య్యారని నగేష్ రెడ్డి ఆరోపించారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృ ద్ధి సంక్షేమం రెండు సమా నంగా అందిస్తున్నామని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందనీ నగేష్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిజా మాబాద్ జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను రూ600 కోట్ల నిధులతో మంజూరు చేయడంలో తొడ్పడటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ ఎంతో కృషి చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో నూడా చైర్మన్ కేశ వే ణు,రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపా ల్,డిసిసి కోశాధికారి భక్తవత్సలం, డిసిసి ఉపా ధ్యక్షులు రత్నాకర్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేంధర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, డిసిసి కార్యదర్శి గణేష్, కరీంద్దీన్, మొయిన్, మహమ్మద్ వలీ పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!