అధికారుల అండతో నిజామాబాద్ జిల్లాలో గుత్తేదారు ఇష్టారాజ్యం.. మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా..? ఏకంగా ప్రభుత్వ అధికారి వాహనంలోనే నిజామాబాద్‌కు తరలింపు? నిందితుల కదలికలపై నిఘా ఉంచిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 16 : నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఓ ప్రముఖ గుత్తేదారు (కాంట్రాక్టర్) వ్యవహారాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై అవినీతి నిరోధక
- అధికారుల అండతో నిజామాబాద్ జిల్లాలో గుత్తేదారు ఇష్టారాజ్యం..
- మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా..?
- ఏకంగా ప్రభుత్వ అధికారి వాహనంలోనే నిజామాబాద్‌కు తరలింపు?
- నిందితుల కదలికలపై నిఘా ఉంచిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)..
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 16 :
నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఓ ప్రముఖ గుత్తేదారు (కాంట్రాక్టర్) వ్యవహారాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.రాజకీయ,అధికార బలంతో సదరు గుత్తేదారు సాగిస్తున్న లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
*అధికారులతో చెలిమి.ఆరోపణల వెల్లువ*
సదరు గుత్తేదారు స్థానికంగా ఉన్న సంబంధిత అధికారులతో సత్సంబంధాలు నెరుపుతూ,వారిని మచ్చిక చేసుకోవడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అధికారుల అండదండలు ఉండటంతో తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆయన వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలతో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నట్లు స్థానికంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
*సరిహద్దులు దాటుతున్న మత్తు పదార్థాలు*
ఈ గుత్తేదారు కల్లు వ్యాపారం మాటున నడిపిస్తున్న మరో కీలక వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది.కల్లులో కలిపేందుకు ఉపయోగించే కొన్ని నిషేధిత మత్తు పదార్థాలను మహారాష్ట్ర సరిహద్దుల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి అక్రమంగా తరలిస్తున్నారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ మొత్తం వ్యూహానికి సదరు గుత్తేదారే కర్త,కర్మ,క్రియగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
*అధికారి వాహనంలోనే రవాణా..?*
ఈ అక్రమ రవాణా ఉదంతంలో ఓ ప్రభుత్వ అధికారి పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సదరు అధికారి తన విధుల్లో ఉన్నట్లు భ్రమింపజేస్తూ..యూనిఫామ్ ధరించి,స్వయంగా తన అధికారిక వాహనంలోనే ఈ నిషేధిత పదార్థాలను సరిహద్దులు దాటించి నిజామాబాద్‌కు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
*మత్తు వ్యాపారంతో కోట్లలో లాభాలు..!!*
అక్రమంగా ప్రభుత్వ వాహనంలో నిజామాబాద్ నగరానికి తరలించిన ఈ నిషేధిత మత్తు పదార్థాల ద్వారా సదరు గుత్తేదారు భారీగా వ్యాపారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.కల్లులో కలిపే నాసిరకం,ప్రాణాపాయకరమైన పదార్థాలను రెట్టింపు ధరలకు విక్రయిస్తూ,నిత్యం లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ దందా ద్వారా సదరు నిందితుడు ఇప్పటికే కోట్లాది రూపాయల అక్రమ లాభాలను గడించినట్లు సమాచారం.అయితే,ఈ మొత్తం వ్యవహారంలో రవాణాకు సహకరిస్తున్న సదరు ప్రభుత్వ అధికారికి కూడా కీలక భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది.గుత్తేదారుతో సమానంగా ఆ అధికారి కూడా ఈ అక్రమ సంపాదనలో అత్యధిక లాభాలు పొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ప్రజాధనంతో నడిచే ప్రభుత్వ వాహనాన్ని ఇలాంటి అక్రమాలకు వాడుకుంటూ,ఇద్దరూ కలిసి కోట్లు కూడబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*త్వరలోనే ఏసీబీ దాడులు..?*
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ,వ్యవస్థలను మభ్యపెడుతున్న ఈ అక్రమ బాగోతంపై ఇప్పటికే ఏసీబీ అధికారులకు నిర్దిష్ట సమాచారం అందినట్లు తెలుస్తోంది.గుత్తేదారుతో పాటు అతనికి సహకరిస్తున్న సదరు అధికారి కదలికలపై కూడా నిఘా సంస్థ కన్నేసినట్లు సమాచారం.అతి త్వరలోనే వీరిద్దరిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జరిపే అవకాశం ఉందనే ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమార్కుల ఆట కట్టించి,చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *