వైరల్ అవుతున్నా,స్పందించని ఉన్నతాధికారులు.. సందేహాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ..విచారణకు మేధావుల డిమాండ్.. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 17 : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఇటీవల కలకలం రేపిన ఓ ‘చేతిరాత మామూళ్ల చిట్టా’ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.సోషల్ మీడియా,వివిధ వార్తా ఛానళ్లు,పత్రికల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాని,జిల్లా యంత్రాంగం కాని కనీస విచారణ జరపకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *ఆ చేతిరాత ఎవరిది..?* గత
- వైరల్ అవుతున్నా,స్పందించని ఉన్నతాధికారులు..
సందేహాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ..విచారణకు మేధావుల డిమాండ్..
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 17 :
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఇటీవల కలకలం రేపిన ఓ ‘చేతిరాత మామూళ్ల చిట్టా’ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.సోషల్ మీడియా,వివిధ వార్తా ఛానళ్లు,పత్రికల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాని,జిల్లా యంత్రాంగం కాని కనీస విచారణ జరపకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
*ఆ చేతిరాత ఎవరిది..?*
గత కొద్దిరోజులుగా పత్రికల్లో,చానల్లలో వార్తలు వస్తూ,సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక డైరీ పేజీలో ‘టాడీ మంత్లీ'(ఈత కల్లు నెలవారీ వసూళ్లు)పేరుతో వివిధ ప్రాంతాల వారీగా భారీ మొత్తంలో నగదు వివరాలను చేతితో రాసి ఉన్నట్లు స్పష్టమవుతోంది.నిజామాబాద్ డిపోలతో పాటు మాధవనగర్,బోర్గం,సారంగాపూర్,న్యాల్కల్,నందిపేట,నవీపేట్ వంటి పలు ప్రాంతాల పేర్ల ఎదురుగా వేలల్లో నిధుల వివరాలు నమోదు చేసి,లక్షల్లో మాముళ్లు వసూలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమౌతుంది.ఈ నేపథ్యంలో శాఖలోని కొందరు సిబ్బంది మధ్యనే, ఈ చిట్టా రాసిన అధికారి ఎవరనే దానిపై బాహాటంగా చర్చ నడిచినప్పటికీ,పైస్థాయి అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*ఏసీబీ సోదాల నేపథ్యంలోనూ నిర్లక్ష్యమేనా..??*
ఇటీవలే జిల్లాలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారి ఒకరు ఏసీబీ సోదాల్లో పట్టుబడి రిమాండ్‌కు వెళ్లిన ఘటన మరువక ముందే,మళ్లీ ఇలాంటి వసూళ్ల చిట్టా బహిర్గతం కావడం పట్ల తీవ్ర కలకలం రేపుతోంది.ఇంత జరుగుతున్నా, కింది స్థాయి సిబ్బంది నుంచి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరకు ఎవరు కూడా స్పందించకపోవడం,నిఘా పెట్టకపోవడం వెనుక ఉన్న బలమైన కారణాలు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
*ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపితే నిజాలు బయటపడతాయా..?*
ఈ వ్యవహారంపై మేధావులు,సామాజిక కార్యకర్తలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.శాఖలో అనుమానం ఉన్న కొందరు అధికారుల చేతిరాతలను సేకరించి,వైరల్ అవుతున్న ఈ చిట్టాతో కలిపి ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL) పరీక్షలకు పంపితే అసలు నిజాలు బట్టబయలవుతాయని వారు సూచిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు,జిల్లా యంత్రాంగం స్పందించి ఈ డైరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజా నిజాలను నిగ్గు తేల్చి నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.మరి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందేనని ప్రజలు,మేధావులు చర్చించుకుంటున్నారు.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *