రీయింబర్స్మెంట్ విడుదల చేయకుంటే ఉద్యమమే…

మెడలు వంచి విద్యార్థుల బకాయిలు వసూలు చేయిస్తాం.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.. విద్య లేని …విద్యాశాఖ మంత్రి మన దుస్థితి ఇలా రేవంత్ సర్కార్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు… రాజకీయాల్లో హాట్ టాపిక్.. ఇందూరు రణభేరి సక్సెస్ విద్యార్థులతో కిక్కిరి సిపోయిన ధర్నా చౌక్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబ ర్స్మెంట్

మెడలు వంచి విద్యార్థుల బకాయిలు వసూలు చేయిస్తాం..

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే పుట్టగతులు ఉండవు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం..

విద్య లేని …విద్యాశాఖ మంత్రి మన దుస్థితి ఇలా

రేవంత్ సర్కార్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు…

రాజకీయాల్లో హాట్ టాపిక్..

ఇందూరు రణభేరి సక్సెస్

విద్యార్థులతో కిక్కిరి సిపోయిన ధర్నా చౌక్

WhatsApp Image 2026 07 17 at 3.09.47 PM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబ ర్స్మెంట్ విడుదల చేయాలని లేని పక్షంలో ఉద్యమం చేపడతామని ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఎంపీ నొక్కి చెప్పారు. రేవంత్ రెడ్డి మెడలు వంచి విద్యార్థుల బకాయిలు వసూలు చేయిస్తామని ఎంపీ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో రణభేరి కార్యక్రమంలో రేవంత్ సర్కారుపై ,రేవంత్ రెడ్డి పై ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు ,ఫీజు రీఎంబర్స్మెంట్ కు కాంగ్రెస్ సర్కార్ కు కమిషన్ కావాలని… విద్యార్థుల నుంచి నిధుల సేకరణ బాక్సులను ఏర్పాటు చేయడం …రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకీల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన”ఇందూర్ రణభే రి” విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.

ఫీజు రియంబర్స్మెంట్ అమలులో డీఎస్ కృషి

ఉన్నత చదువులు చదువుకోలేని పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి.. మొట్టమొదట ఫీజు రీయింబర్స్ మెంట్ ఆలోచన పుట్టింది.. ఇందూర్ గడ్డపైనే అని ఎంపీ ధర్మపురి అరవింద్ నొక్కి చెప్పారు. బడుగు బలహీన వర్గాలు.. ఉన్నత విద్య అందక పిల్లలు ఫీజు లు కట్టలేకపోతున్నారని ఆనాటి పిసిసి చీఫ్ డీఎస్ ఆలోచన చేశారు. రియంబర్సమెంట్ అంశాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దృష్టికి తీసుకెళ్లి డీఎస్ ఆధ్వర్యంలోనే రియంబర్స్ మెంట్ అమలుకు ప్రణాళికలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. అప్పట్లో 2004లో అధికారంలోకి వస్తే ఇస్తా మని మ్యానిఫెస్టోలో చేర్చి ఫీజు రియంబర్స్ మెంట్ అమలయ్యాక వేలాది మంది విద్యార్థులు ఇవాలా ఉన్నత స్థితిలో ఉన్నారనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రియంబర్స్మెంట్ అమలులో ధర్మపురి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

యావత్ తెలంగాణ సమాజం ఆలోచించా ల్సిన విషయం ఫీజు రియంబర్స్మెంట్

WhatsApp Image 2026 07 17 at 3.09.46 PM 1

ఫీజు రియంబర్స్ మెంట్ అంశం కేవలం విద్యార్థులదే కాదు అందరిదీ అని ఎంపీ అన్నారు. ఈ అంశం సమాజంలో లోతైన అంశ మని యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాల్సి న విషయమని ఎంపీ అన్నారు. రాష్ట్ర ఆర్ధిక స్థితిని, దేశ జిడిపిని పరుగులెత్తించిన స్కిం ఇది అని ఎంపీ తెలిపారు. ఆలాంటి స్కిం ను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నా డని ఎంపీ మండి పడ్డారు. ఫీజు రీయంబ ర్స్మెంట్ పాత బకాయిలు రూం10 వేల కోట్లు, కొత్త బకాయి లు రూ.2 వేల కోట్లు క్లియ ర్ చేయాల్సి ఉందని ఈ సందర్భంగా ఎంపి గుర్తు చేశారు. ఇప్పటికీపుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే రేవంత్ సర్కార్ ని విద్యార్థులే కూ లదోస్తారనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

భూముల అమ్మిన పైసల్ తో ఫీజు రీఎంబ ర్స్మెంట్ విడుదల చేయూ…

హైదరాబాద్ లో భూము లమ్మిన పైసలుతో ఫీజు రియంబర్స్మెంట్ కట్టాల ని ఎంపీ డిమాండ్ చేశా రు. ఆంధ్రప్రదేశ్లో చంద్ర బాబు నాయకత్వంలో పాలన బాగా జరుగు తుందని.. నీ గురువు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని రేవంత్ రెడ్డికి ఎంపీ హితవు పలికారు. అసలు రేవంత్ రెడ్డి కి.. ఫుట్ బాల్ ఆట మీద ఉన్న సోయి విద్యార్థుల భవిష్యత్తు మీద లేదనీ ఎంపీ విమర్శించారు.

_మనవడి కోసం పూరీలు చేయడం కాదు.. ప్రజా సంక్షేమం కోసం మంచి పాలన చేయాలి..

ఒకవైపు విద్యార్థులకు ఉన్నత విద్య అందక… ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ మనవడికి పూరీలు చేయడం కాదు… ప్రజల కోసం మంచి పాల న చేయు అని ఎంపీ హిత వు పలికారు.

కేసీఆర్ తోవలోని రేవంత్…

రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా ప్రమాదకరం అని నేను గతంలో చెప్పాను.. ఇప్పు డు రేవంత్ అదే నిజం చేస్తున్నాడనీ ఎంపీ తెలి పారు. గతంలో కేసీఆర్ కమిషన్ల కోసం… రాష్ట్రా న్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన విషయం తెలి సిందే… ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే కోవలో కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తుండని ఎంపీ ఆరోపించారు.

విద్య లేని విద్యా శాఖ మంత్రి …మన దుస్థితి

విద్య లేని వ్యక్తి… మనకు విద్యా శాఖ మంత్రిగా ఉ న్న దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముఖ్య మంత్రి పట్టించుకోక పోవడంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫీజు రియంబర్స్మెంట్ పై అందరం కలిసి పోరాడాలి

WhatsApp Image 2026 07 17 at 3.09.48 PM

ఫీజు రియంబర్స్మెంట్ మేధావులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరు కలిసి పోరాడా లని ఎంపీ పిలుపునిచ్చా రు. లేకపోతే ఒక తరం మరుగున పడిపోయే ప్రమాదం ఉందనీ ఎంపీ తెలిపారు.

రాష్ట్రంలో వచ్చేది బిజెపియే..

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి తీసుకె ళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వా నికి పుట్టగతులు ఉండ వని..రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి రావడం ఖాయ మని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.

విద్యార్థులతో కిక్కిరిసిన ధర్నా చౌక్..

WhatsApp Image 2026 07 17 at 3.09.46 PM

రణభేరి కార్యక్రమానికి విద్యార్థులు అధిక సంఖ్య లో తరలివచ్చారు. విద్యా ర్థులతో ధర్నా చౌక్ కిక్కిరి సిపోయింది. కంటేశ్వర కమాన్ నుంచి విద్యార్థు లు ధర్నా చౌక్ వరకు ఎంపీ ధర్మపురి అరవింద్ తో ర్యాలీగా వచ్చారు. మరోవైపు విద్యార్థులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ర్యాలీ గా రణభేరి కార్యక్రమానికి వచ్చారు. రణభేరి కార్యక్ర మం విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై పూర్తిగా విజయవంతం చేసినం దుకు ఎంపీ ధర్మపురి అర వింద్ ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు. ఈ కార్యక్ర మంలోబిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, బిజెపి రాష్ట్ర నాయకులు స్రవంతి రెడ్డి నాగోల్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం నాయకులు, బిజెపి నాయకులు కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!