నేత్రపర్వంగా జగన్నాథ రథయాత్ర..

వారం రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు నగరంలోని పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు.. జై జగన్నాథ నామస్మరణతో మారుమోగిన ఇందూర్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17: ఇందూర్ లో జగన్నాథ యాత్ర అత్యంత వైభవంగా కొనసా గింది. స్వామి వారిని రథంపై ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నిజామా బాద్ నగరంలోని గంజి ప్రాంతంలో జగన్నాథుడు, సుభద్రాదేవి, బల రామకృష్ణుడి ప్రతిమలతో మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసి వారం రోజులపాటు

వారం రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజలు

నగరంలోని పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు..

జై జగన్నాథ నామస్మరణతో మారుమోగిన ఇందూర్

jaggganata1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 17:

ఇందూర్ లో జగన్నాథ యాత్ర అత్యంత వైభవంగా కొనసా గింది. స్వామి వారిని రథంపై ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నిజామా బాద్ నగరంలోని గంజి ప్రాంతంలో జగన్నాథుడు, సుభద్రాదేవి, బల రామకృష్ణుడి ప్రతిమలతో మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసి వారం రోజులపాటు ప్రతిరోజు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ యాత్ర నేత్రపర్వంగా జరుపుకున్నారు.

జగన్నాథ నామస్మరణ తో మారు మ్రోగిన ఇందూర్

jaggganata

ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయంలో మాదిరిగా నిజా మాబాద్ గంజి ప్రాంతంలో నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో పూరి జగన్నాథ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. జగన్నాథ స్వామివారిని దర్శించుకు నేందుకు భక్తులు బారులు తీరారు. జగన్నాథ నామ స్మరణతో ఇందూర్ మార్మోగింది.

పురవీధుల గుండా భక్తజన సందోహంతో వైభవంగా రథయాత్ర..

jaggganata2

నిజామాబాద్ నగరంలో గంజి ప్రాంతం నుంచి ప్రారంభమైన జగన్నాథ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. భక్తజన సందోహం రథాన్ని లాగుతూ… జై జగన్నాథ …జై జగన్నాథ నామస్మరణ చేస్తూ ఎంతో ఉత్సాహంగా నగరంలోని గంజి ప్రాంతం నుంచి మొద లుకొని గాంధీచౌక్, పెద్ద బజార్, రాజరాజేంద్ర చౌరస్తా, పూలాంగ్, ఎల్ల మ్మగుట్ట, ఎన్టీఆర్ చౌరస్తా రైల్వే స్టేషన్ చౌరస్తా మీదుగా గంజి ప్రాంతం వరకు రథయాత్ర కొనసాగింది. జగన్నాథ ఉత్సవాలను, రథ యాత్రను విజయవంతం చేసినందుకు భక్తజన సందో హానికి నిజామాబాద్ ఇస్కాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

jaggganata5

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!