ఇగ సూడుండ్రి.. ఇగ సూడుండ్రి.. కొలులు లేక కొందరేడిస్తే,సర్కార్ కోలులున్నోళ్ల ఏడుపు ఇట్లున్నది.. నిజామాబాద్ ఆబ్కారీల ఇంకొన్ని తిమింగిలాలు.. ఆ తిమింగిలాల మీద గూడ నజరున్నది.. అబ్కారీ మీద ఆర్తలు రాస్తే,అబద్దపు అక్రమ కేసులు.. కల్లు ముస్తేదారులతోని దోస్తులు.. కబురు న్యూస్,నిజామాబాద్,జూన్ 24 : ఆదాయానికి మించి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జూసి అవ్వ అంటూ,నోట్ల ఏలు ఏసుకొని బిత్తర బోయిన ఏసీబి అధికారులు.సర్కార్ కొలులు ఉన్నోళ్ళందరి ఇండ్లల్ల ఏసీబి ఇట్లనే దాడులు,సోదాలు జేస్తే మనదే ధనిక
- ఇగ సూడుండ్రి.. ఇగ సూడుండ్రి..
- కొలులు లేక కొందరేడిస్తే,సర్కార్ కోలులున్నోళ్ల ఏడుపు ఇట్లున్నది..
- నిజామాబాద్ ఆబ్కారీల ఇంకొన్ని తిమింగిలాలు..
- ఆ తిమింగిలాల మీద గూడ నజరున్నది..
- అబ్కారీ మీద ఆర్తలు రాస్తే,అబద్దపు అక్రమ కేసులు..
- కల్లు ముస్తేదారులతోని దోస్తులు..
కబురు న్యూస్,నిజామాబాద్,జూన్ 24 :
ఆదాయానికి మించి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జూసి అవ్వ అంటూ,నోట్ల ఏలు ఏసుకొని బిత్తర బోయిన ఏసీబి అధికారులు.సర్కార్ కొలులు ఉన్నోళ్ళందరి ఇండ్లల్ల ఏసీబి ఇట్లనే దాడులు,సోదాలు జేస్తే మనదే ధనిక రాష్ట్రమైతదని పలువురు మేధావుల ముచ్చట.అనుమానం ఉన్నోళ్ల ఇండ్లల్ల,పిర్యాదు జేసిన ఇండ్లల్ల గాకుండా అందరిండ్లల్ల జేస్తేనే ప్రభుత్వ ఖాజానా నిండుతదని పబ్లిక్ అంటున్నరు.మీద పోట్వల సూసిండ్రు గదా నోట్ల కట్టలతోని అయ్య, మల్లన్న మొఖం దగ దగ ఎండిపోయిందని నవ్వుకుంటున్నరు.అక్రమంగా అట్లా కట్టలకు కట్టలు నోట్లు జమ జేసుకుంటా,కోట్లకు కోట్లు ఆస్తులు కూడబెట్టిండు..ఏదైతేనేం అయ్యగాడు సూత్తే నోట్లె ఏలు వెడితే కొర్కడన్నట్లే గని బాగంటే బాగ ఉషారు దేలిండు..కొలులు లేక కొందరేడిస్తే,సర్కారు కోలులున్నోళ్లు,ఇగొ ఇట్ల ఏడుస్తున్నరు.పన్ల పని నిజామాబాద్ ఆబ్కారీ(ఎక్సైజ్ శాఖల)ల ఇంకొన్ని అక్రమ అవినీతి తిమింగిలాలు ఉన్నట్లు, అవ్విటి మీద గూడ ఒక నజర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం..త్వరలోనే మిగిలిన తిమింగిలాల పని పడుతున్నట్లు తెలుస్తుంది..ఏమన్న గాని గని తెలంగాణ రాష్ట్ర ఏసీబి ఉన్నతాధికారులు మాత్రం రాష్ట్రం మొత్తంలనే అవినీతి తిమింగిలాల భరతం పట్టుడుకు తయారైనట్లు తెలుస్తుంది.వాస్తవాలను బయటపెడుతూ,అబ్కారీ మీద వార్తలు రాస్తే,అక్రమ అబద్ధపు కేసులు బనాయిస్తుండ్రు.లోపట లోపట కల్లు మూస్తేదారులు,మద్యం వ్యాపారులతోని పక్కా దోస్తులు..ఇగ కోట్లకు కోట్లు పైసలు ఎట్ల జమ గావో పాఠకులు,ప్రజలు మీరే జెప్పుండ్రి..
*ఇగ మాయదారి మల్లన్న ఆస్తులు ఇప్పుడైతే తెలిసినకాడికి గివ్వి..*
అసమాన ఆస్తుల (Disproportionate Assets) కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డికి సంబంధించిన 11 ప్రాంతాల్లో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించగా తెలిసినవి.తెలియనివి ఇంకా ఎన్నో మరి.. మొత్తం బయట వడ్డoక సూద్దాం మరి..
*సోదాల్లో గుర్తించిన ఆస్తులు:*
🔹 4 ఇళ్లు
🔹 1 వాణిజ్య భవనం (కమర్షియల్ బ్లాక్)
🔹 8 స్థలాలు (ప్లాట్లు)
🔹 10.23 ఎకరాల వ్యవసాయ భూమి
🔹 బ్యాంకు ఖాతాల్లో రూ.50 లక్షల నిల్వలు
🔹 ఇంకా తెరవాల్సి ఉన్న 3 బ్యాంకు లాకర్లు
ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.3 కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించారు.అయితే ప్రస్తుత మార్కెట్ విలువ దీనికంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.వందల కోట్లు కూడబెట్టినట్లు అధికారుల అంచనా అని తెలుస్తుంది..














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *