“​సోషల్ మీడియా” నీకో దండం

“​సోషల్ మీడియా” నీకో దండం

ఫోన్ కు దూరంగా ఉండి ఆల్ ఇండియా 20వ ర్యాంక్.. ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేసి,ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్.. సోషల్ మీడియాని వీడండి,ర్యాంకులు సాధించండన్న వైష్ణవి దాస్.. కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 : ​సోషల్ మీడియా మాయలో యువత జీవితాలు నాశనం ​ఇన్‌స్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వద్దు, చదివే ముద్దు ​దేశంలో నేటి యువత సోషల్ మీడియాపై మితిమీరిన ఆసక్తితో తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చదువుకునే వయసులో పుస్తకాలతో గడపాల్సింది పోయి,ఇన్‌స్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వంటి యాప్‌లలో అమూల్యమైన సమయాన్ని

  • ఫోన్ కు దూరంగా ఉండి ఆల్ ఇండియా 20వ ర్యాంక్..
    ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేసి,ర్యాంక్ సాధించిన వైష్ణవి దాస్..
    సోషల్ మీడియాని వీడండి,ర్యాంకులు సాధించండన్న వైష్ణవి దాస్..

కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 :

​సోషల్ మీడియా మాయలో యువత జీవితాలు నాశనం
​ఇన్‌స్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వద్దు, చదివే ముద్దు
​దేశంలో నేటి యువత సోషల్ మీడియాపై మితిమీరిన ఆసక్తితో తమ బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.చదువుకునే వయసులో పుస్తకాలతో గడపాల్సింది పోయి,ఇన్‌స్టాగ్రామ్,ఫేస్బుక్,వాట్సప్ వంటి యాప్‌లలో అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ తీవ్రంగా వృథా చేసుకుంటున్నారు. అయితే,సోషల్ మీడియాకు కేటాయించే ఆ సమయాన్ని నిజంగా చదువుకు ఉపయోగిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో కర్ణాటకకు చెందిన వైష్ణవి దాస్ నిరూపించి చూపించింది.అనవసర వ్యాపకాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని చాటిచెప్పిన వైష్ణవి,నీట్ రీటెస్ట్ 2026 ఫలితాల్లో 720 మార్కులకు గాను ఏకంగా 700 మార్కులు సాధించి ఆల్ ఇండియా 20వ ర్యాంక్‌తో సత్తా చాటింది.తాను ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లను డిలీట్ చేసి పూర్తి సమయాన్ని చదువుకే కేటాయించడం వల్లే ఈ స్థాయిలో విజయం లభించిందని తెలిపిన ఆమె,డిస్ట్రాక్షన్స్‌కు దూరంగా ఉండటమే తన విజయరహస్యమని వెల్లడించింది.నేటి యువత సోషల్ మీడియా మాయలో పడి చదువుపై శ్రద్ధ తగ్గించుకుంటున్నారని,ఇప్పటికైనా మేల్కొని యాప్‌లను వదిలిపెట్టి చదువుపై మక్కువ చూపాలని కోరింది.ఎన్నో కష్టాలకోర్చి తమ పిల్లలను ప్రయోజకులను చేయాలని తల్లిదండ్రులు తపిస్తుంటే,పిల్లలు మాత్రం ఆన్‌లైన్ చాటింగ్‌లు, రీల్స్‌కు అలవాటు పడి సమయాన్ని వృథా చేసుకుంటూ వైఫల్యాల వైపు పయనిస్తున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యువత తమ కష్టాన్ని గుర్తించి,వైష్ణవి దాస్‌ను ఆదర్శంగా తీసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆకాంక్షిస్తున్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!