ఫ్రస్టేషన్ లో బీగాల సోయి లేకుండా మాట్లాడుతుండు

పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరిట చేసిన అవినీతి మరిచావా? కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేదు గానీ! _గెలిచిన ఒక్క సీటును కూడా అమ్ముకొని కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన నీవు నాపై మాట్లాడడమా? నయా పైసా ముట్టకుండా అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న నాపై ఆరోపణ లా? పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఘనత నీది.. మాజీ ఎమ్మెల్యే బిగాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్… ఉమ్మడి జిల్లా

పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరిట చేసిన అవినీతి మరిచావా?

కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేదు గానీ!

_గెలిచిన ఒక్క సీటును కూడా అమ్ముకొని కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన నీవు నాపై మాట్లాడడమా?

నయా పైసా ముట్టకుండా అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న నాపై ఆరోపణ లా?

పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఘనత నీది..

మాజీ ఎమ్మెల్యే బిగాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్…

WhatsApp Image 2026 06 04 at 3.34.10 PM 1

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 4:

అధికారం లేక మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సిసీసీ (కమీష న్ ,కరప్షన్, కలెక్షన్) కి దూరమై ఫ్రస్టే షన్ లో సోయి లేకుండా మాట్లాడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ ధ్వజమెత్తారు. అవినీతి, అభివృద్ధిపై కాం గ్రెస్ పార్టీని ఎదుర్కొనే ద మ్ము లేదు కానీ తనపై ఆరోపణలు చేస్తు న్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పా ల్ సూర్యనారాయణ తెలి పారు. గురువారం జిల్లా కేంద్రం లోని ప్రగతి నగర్ లో గల బిజెపి జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయ ణ మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బిగాల మొఖం చాటేశా డు. నగరానికి ఎప్పుడో ఒకసారి వస్తున్నారన్నా రు. అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో అవగాహన లేకుండా తన పై ఆరోపణలు చేస్తున్నా డని విమర్శించారు.

అసమర్ధ నాయకుడు బిగాల

_గెలిచిన ఒక్క సీటును కూడా అమ్ముకొని కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన నీవు నాపై మాట్లాడడమా?

ఇటీవల జరిగిన మున్సి పల్ ఎన్నికల్లోను 60 స్థానాల్లో బిఆర్ఎస్ ఒకటే సీటును గెలుపొంది, కనీ సం ఆ ఒక్క సీటును కూ డా కాపాడుకోలేని అసమ ర్ధత నాయకుడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ ఆరోపించారు. తాను గెలిచిన తర్వాత గతంలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని అభివృద్ధి పరచ డానికి కృషి చేస్తున్నాన న్నారు. ఇది జీర్ణించుకో లేని బిగాల అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఘనత నీది..

పదేళ్లు అధికారంలో ఉ న్నా గణేష్ బిగాల అర్బన్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇప్పించలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ ఆగ్రహాం వ్య క్తం చేశారు. గత ప్రభు త్వంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి గా ప్రశాంత్ రెడ్డి ఉన్నాడని, ఆయన కు రాజీనామా చేయమని ఎందుకు అడగలేదని ప్ర శ్నించారు. అలాగే ప్రతి ష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ లో ఒక్క ప్రముఖ కంపెనీ కూ డా తీసుకు రాలేదని మరి కేటీఆర్ నిరాజీనామా చేయమని నిల దీశావా అని ప్రశ్నించారు. కేవలం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే పని చేశావే తప్ప.. నిజామాబాద్ అభి వృద్ధికి కాదని ఎద్దేవా చేశారు. కమిషన్ కరప్షన్ కలెక్షన్ కు అలవాటు పడి పదేళ్లు పాలిం చాడని అర్బన్ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. ఇటీవల తాను మంత్రుల పై ఒత్తిడి తేవడంతో నగరంలో 396 ఇల్లు కేటాయించా రన్నారు.

నువ్వు చేసిన అవినీతి మరిచావా?

బీగాలను ప్రశ్నించిన ధన్ పాల్

మినీ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన చెట్లలో అవినీతికి పాల్ప డ్డ చరిత్ర బిగాలది అన్నారు. నాలు గున్నర వేల ఒక్కో చెట్టు ను రూ45 వేలు గా చూ యించి దోచుకున్నారన్నా రనీ ఎమ్మెల్యే ఆరోపించారు. అలాగే కార్పొరేషన్ లో ఒక్క మనిషి విధులు నిర్వహించు కున్నా.. 330 మంది పనిచే స్తున్నట్లు రికార్డుల్లో చూయించి నెల కు రూ. 50 లక్షలు దోచుకు న్నాడని ఆరోపించారు. నగరం లోని మినీ ట్యాంకు బండ్ పై బిగాల గణేష్ గుప్తా అవగా హన లేకుండా ఆరోపణలు చేస్తున్నా డని అర్బన్ ఎమ్మెల్యే ధన పాల్ సూర్యనారాయణ తెలిపారు. ట్యాంక్ బండ్ కాంట్రాక్టర్ సమయం ముగి యడంతో తాళాలు వేసి వెళ్లారన్నారు. కొత్త కాంట్రా క్టర్ నియమంచాల్సిన బా ధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం, కార్పొరేషన్ పై ఉందన్నా రు.

అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమే

ఏ శాఖలో అయినా తాను ఒక్కరూపాయి అవినీతి చేసినట్లు నిరూపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల గణ పతి ఆలయం ముందుకు తా ను వస్తానని చెప్పారు. తన హయాంలో ఒక్క గుంట భూమి కొనుగోలు చేయలేదని, బిగాల మా త్రం ఒక్క గుంట కూడావిడిచిపెట్టలేదన్నారు.అలాగే ఆర్యవైశ్యులు అంటే దానధర్మాలకు ప్రతిక అని, కానీ బిగాల మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉ న్నాడన్నారు.ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్య దర్శి స్రవంతి రెడ్డి, బిజెపి ఫ్లోర్ లీడర్ ప్రమోద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతి, కార్పొరే టర్లు చింతకాయల రాజేందర్, మఠం పవన్, బంటు ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణు గోపాల్, కల్పే అర్చనా చిరంజీ వి, మమత శివ, సీనియర్ నాయకులు రాజు, పుట్ట వీరేందర్, బీజే వైఎం రాష్ట్ర కో కార్యదర్శి విజయ్, ఇల్లెందుల ప్రభా కర్, గిరిబాబు పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!