టీజేఏ జిల్లా అధ్యక్షులు సాయి ప్రసాద్ ఘనంగా టీజేఏ 12వ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 23: జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతూ మేము సైతం అంటూ సమాజ సేవలో భాగ స్వాములమవుతామని టీజేఏజిల్లా అధ్యక్షులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసి) సభ్యులు సాయి ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘా ల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్
టీజేఏ జిల్లా అధ్యక్షులు సాయి ప్రసాద్
ఘనంగా టీజేఏ 12వ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 23:
జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతూ మేము సైతం అంటూ సమాజ సేవలో భాగ స్వాములమవుతామని టీజేఏజిల్లా అధ్యక్షులు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ (డీఎంఏసి) సభ్యులు సాయి ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు సంఘా ల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ అనుబం ధ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ (టీజేఏ) 12వ ఆవిర్భావ దినోత్సవ వేడు కలు నిజామాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మాన సిక వికలాంగుల (స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్)లో విద్యార్థులకు బిస్కెట్లు తదితర వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ మాట్లాడుతూ… టీజేఏ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు కెవి రమణారావు, ప్రధాన కార్యదర్శి గోరి నేతృత్వం లో జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం సాగుతోందన్నారు. అలాగే సామాజిక సేవ కార్యక్రమా లు కూడా నిర్వహిస్తున్నారని కొనియాడారు.
టీజేఏ సేవలు అభినందనీయం
స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య
టీజేఏ సేవలు అభినంద నీయమని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రుక్షన్ కార్యదర్శి సిద్దయ్య అన్నారు. టీజేఏ ఆవిర్భావాన్ని కేవలం వేడుకగానే కాకుం డా, ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, విద్యార్థులకు నోట్‌బు క్స్ అందజేయడం, ఇతర వితరణ వంటి సేవ కార్య క్రమాలతో నిర్వహించడం అభినందనీయమనీ కొనియాడారు.జర్నలిస్టుల వృత్తిగత భద్రత, ఆత్మ గౌరవం, సంక్షేమం కోసం టీజేఏ అసోసియేషన్ చేస్తున్న పోరాటాలు సఫ లీకృతం కావాలని సిద్ద య్య ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో టీజేఏ ప్రతి నిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మాలి పాండు, శ్రీనివా స్ రెడ్డి,యశస్వి మురళీ కృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ పాల్గొన్నారు.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *