అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో విషం కలిపినట్లు పోలీసుల వెల్లడి… నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన మోపాల్ పోలీసులు… కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 03 : మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపి భర్త,అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మోపాల్ ఎస్‌ఐ సుష్మిత సోమవారం తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం,ఈ నెల 1న ముదక్‌పల్లి గ్రామానికి
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే అనుమానంతో విషం కలిపినట్లు పోలీసుల వెల్లడి…
నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన మోపాల్ పోలీసులు…
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,ఆగస్టు 03 :
మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపి భర్త,అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.ఈ కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మోపాల్ ఎస్‌ఐ సుష్మిత సోమవారం తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం,ఈ నెల 1న ముదక్‌పల్లి గ్రామానికి చెందిన పొట్టోళ్ల సోనీ (33) తన భర్త భూమన్న, అత్త బుదెవ్వకు వడ్డించిన మిల్ మేకర్ కూరలో గడ్డి మందు కలిపినట్లు విచారణలో వెల్లడైంది. కూర తిన్న అనంతరం బుదెవ్వకు వాంతులు, విరోచనాలు కాగా, భూమన్న అస్వస్థతకు గురై కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని ఒప్పుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు, హత్యాయత్నాలకు సంబంధించిన ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *