ఏ మొఖం పెట్టుకొని నిజామాబాద్ లో తిరు గుతుండ్రు జిల్లాకు అతి ముఖ్యమైన ప్రాజెక్టుపై ఇంత నిర్లక్ష్యమా? మాధవ నగర్ ఆర్ఓబి పనులకు నిధుల జాప్యం పై మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే పై మండి పడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ఓబి వద్ద ఎంపీ సెల్ఫీ వీడియో.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19: కాంగ్రెస్ ప్రభుత్వం జర కమీషన్లు బంద్ చేసి ఆర్ఓబి నిర్మాణ పనులను వెం
ఏ మొఖం పెట్టుకొని నిజామాబాద్ లో తిరు గుతుండ్రు
జిల్లాకు అతి ముఖ్యమైన ప్రాజెక్టుపై ఇంత నిర్లక్ష్యమా?
మాధవ నగర్ ఆర్ఓబి పనులకు నిధుల జాప్యం పై మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి ,రూరల్ ఎమ్మెల్యే పై మండి పడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్
ఆర్ఓబి వద్ద ఎంపీ సెల్ఫీ వీడియో..

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 19:
కాంగ్రెస్ ప్రభుత్వం జర కమీషన్లు బంద్ చేసి ఆర్ఓబి నిర్మాణ పనులను వెం టనే పూర్తి చేయండని ఎంపీ ధర్మపురి అరవింద్ ధ్వజమెత్తారు. శుక్రవారం సాయంత్రం మాధవ్ నగర్ వద్ద ఆర్ ఓబి నిర్మాణ పనుల వద్ద ఎంపీ ధర్మపు రి అరవింద్ సెల్ఫీ వీడియో లో టిపిసిసి మహేష్ కు మార్ గౌడ్, ప్రభుత్వ సల హాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూప తిరెడ్డి రెడ్డి కాంగ్రెస్ ప్రభు త్వం పై తీవ్రస్థాయి లో ఎంపీ ఫైరయ్యారు. ఈ సందర్భంగా సెల్ఫీ వీడి యోలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు.మాధవ్ నగర్ ఆర్ఓబి నిర్మాణ పనులు ఏదో మొ క్కుబడిగా కొనసాగుతుం దని ఎంపీ అన్నారు. ఇం దూరు ప్రజలు 30 సంవ త్సరాలుగా ఈఆర్ఓబి కోసం ఎదురు చూస్తున్నా రని తెలిపారు. బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పోరా టాలు చేసి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఫ్లైఓ వర్ ను సాంక్షన్ చే యించుకుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని సగం నిధులు రాష్ట్ర ప్రభుత్వా న్ని సగం నిధులు ఉంటా యన్నారు. బిజెపి పోరా టాలు, ధర్నా లు చేయగా చివరికి వచ్చిందన్నారు. తర్వాత బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిం ది.ఈ ప్రాంతం ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే, అంతే కాకుండా ఇక్కడో పెద్దమ నిషి ఉంటాడు… సుదర్శన్ రెడ్డి నెలకు మూడు, నాలు గు సార్లు హైదరాబాద్ కి వెళ్లి వస్తుంటాడని ఎంపీ తెలిపారు. ఈ ఆర్ఓబి నీ శాంక్షన్ చేయించి, పనుల ను ప్రారంభింప జేసి, ఒక రూపాయి కమిషన్ లేకుం డా మేము కృషి చేస్తు న్నా మని ఎంపీ అన్నారు. ఈ ఆర్ వో వికి సంబం ధించి గతంలో బిల్లులు పెండిం గ్ ఉంటే ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర మం త్రుల తో మాట్లాడి బిల్లు ఇప్పిం చడం జరిగిందన్నారు. మల్ల ఇప్పుడు రూ.3 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడంపై ఎంపి మం డిపడ్డారు. టోకెన్ నెంబర్లు వస్తాయి.. మంత్రి దగ్గరకు పోవాలి… వాళ్లకు కమి షన్లు ఇస్తే గానీ పైసలు రిలీ జ్ చేయడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరో పించారు. ఇది చాలా ము ఖ్య మైన ప్రాజెక్టు అని ఎంపీ అన్నారు. ఇది నిజా మాబాద్ పట్టణానికి హైవే కి కలిపేది.. రోజుకు పదు ల సంఖ్యలో ఈ రోడ్డు గుం డా అంబులెన్సులు, వం దల సంఖ్యలో వేల సంఖ్య లో వాహనాలు వెళ్తుంటా యన్నారు. ఇంత ప్రాధాన్య త ఉన్న ఈ ప్రాజె క్టుపై కాంగ్రెస్ ప్రభు త్వా నికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏ మొఖం పెట్టుకొని జిల్లాలో తిరుగుతుం డ్రు ..
అసలు కాంగ్రెసోళ్ళు ఏ మొఖం పెట్టుకొని జిల్లాలో తిరుగుతుండ్రని ఎంపీ విమర్శించారు.2014లో ప్రారంభమైన మాధవ నగ ర్ ఆర్ఓవి నిర్మాణ పను లకు గ్రహణం పట్టిందని అన్నారు. కమిషన్లు మింగితే మింగి సావుండ్రి.. త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేయండి అని ఎంపీ హెచ్చరించారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *