👉కేసీఆర్ హయాంలో నే రైతును రాజుగా గౌరవించిడ్రూ.. 👉తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపిన ఘనత కేసీఆర్ 👉యాప్‌ల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను పరేషాన్ చేస్తున్న కాంగ్రెస్ 👉మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్20: ఎద్దు ఏడ్చిన, ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్ప టికీ బాగుపడదని నిజా మాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటుకు అనంత రం ముఖ్యమంత్రి కల్వ
👉కేసీఆర్ హయాంలో నే రైతును రాజుగా గౌరవించిడ్రూ..
👉తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలిపిన ఘనత కేసీఆర్
👉యాప్‌ల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను పరేషాన్ చేస్తున్న కాంగ్రెస్
👉మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్20:
ఎద్దు ఏడ్చిన, ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్ప టికీ బాగుపడదని నిజా మాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటుకు అనంత రం ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవ సాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వినూత్న పథకాలను అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలి చిందని పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్దగల బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ తో పాటు గణేష్ బిగాల మాట్లాడారు కేసీఆర్ హయాంలో రైతును రాజుగా భావించి రైతు సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. రైతులకు పెట్టు బడి భారం తగ్గించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి సంవ త్సరానికి రూ.10,000 చొప్పున పెట్టుబడి సహాయం అందించారని చెప్పారు. నాణ్యమైన విత్త నాలు, ఎరువులు రైతు లకు అందుబాటులో ఉం చారని తెలిపారు. వ్యవ సాయ యాంత్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యం త్రాలను సబ్సిడీలపై అం దించి రైతుల శ్రమను తగ్గించారని పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండే..
రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి అందించడం ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేసుకునే పరిస్థితు లు కెసిఆర్ హయాంలో కల్పించారని అన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షల ఎకరాలకు నీరందిం చడం ద్వారా సాగు విస్తీ ర్ణం గణనీయంగా పెరిగిం దని తెలిపారు. దేశ జనా భాలో తెలంగాణ వాటా కేవలం మూడు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, దేశ ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 50 శాతానికి పైగా వాటా సాధించి దేశా నికే అన్నపూర్ణగా నిలిచిం దంటే అది కేసీఆర్ అ మలు చేసిన రైతు అను కూల విధానాల ఫలిత మేనని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా సుమారు రూ.77 వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చే యడం జరిగిందని, రైతుల కు రూ.27 వేల కోట్లకు పైగా రుణ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశా రు. రైతు కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుకు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కుటుంబం ఆర్థిక ఇబ్బం దులు ఎదుర్కోకుం డా ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ఈ పథకం కింద వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చడంతో పాటు రూ.6,800 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందిం చిందని తెలిపారు.
రైతు సంక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకో వడం లేదని గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. వర్షాకాలం సాగు ప్రారంభ మైన సమయంలో రైతు లకు సకాలంలో ఎరువు లు అందించాల్సిన బాధ్య త ప్రభుత్వంపై ఉన్నప్ప టికీ, ఆ బాధ్యతను విస్మ రించి యాప్‌లు, ఆన్‌లైన్ విధానాల పేరుతో కాల యాపన చేస్తోందని మండి పడ్డారు. ఎరువుల కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. రైతు కష్టాలను అర్థం చేసుకుని వారికి అవసరమైన సదుపా యాలు కల్పించాల్సిన ప్రభుత్వం, రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ వ్యవహరించడం దుర దృష్టకరమని పేర్కొన్నా రు. రైతు సంక్షేమాన్ని విస్మరించే ఏ ప్రభుత్వం అయినా ప్రజల మద్దతు కోల్పోతుందని హెచ్చరిం చారు. రైతుల సమస్యల ను వెంటనే పరిష్కరించి ఎరువులు, విత్తనాలు, సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నూ డా మాజీ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి సిర్ప రాజు, సత్య ప్రకా ష్,సుజిత్ సింగ్,జగత్ రెడ్డి,బిల్లా మహేష్ పాల్గొన్నారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *