జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయండి

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 23: నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూరు (నిజామాబాద్) వారి ఆధ్వర్యలో శుక్రవారం (నేడు) నిర్వహించే శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షులు రామానందరాయ్ గౌరదా స్ కోరారు. గురువారం కంటే శ్వర్ లో నిర్వహించిన రథయా త్ర సన్నాహక సమావేశంలో అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్ మాట్లాడారు. జగన్నాథుడు కొలువైన పూరి పట్ట ణంలో మాదిరిగానే ఇందూర్ నగరంలో శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవాన్ని

WhatsApp Image 2026 07 23 at 5.17.28 PM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 23:

నిజామాబాద్ నగరంలో ఇస్కాన్ కంఠేశ్వర్ ఇందూరు (నిజామాబాద్) వారి ఆధ్వర్యలో శుక్రవారం (నేడు) నిర్వహించే శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షులు రామానందరాయ్ గౌరదా స్ కోరారు. గురువారం కంటే శ్వర్ లో నిర్వహించిన రథయా త్ర సన్నాహక సమావేశంలో అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్ మాట్లాడారు. జగన్నాథుడు కొలువైన పూరి పట్ట ణంలో మాదిరిగానే ఇందూర్ నగరంలో శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవాన్ని జూలై 24(నేడు) శుక్రవారం మధ్యా హ్నం 2 గంటలకు నీలకంఠేశ్వర ఆలయం నుండి శ్రీరామ గార్డెన్ వరకు అంగరంగ వైభవంగా ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిం చడం జరుగుతుందని తెలి పారు.

జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందిలా..

ఈ రథయాత్ర శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమై రైల్వే కమాన్, గణేష్ చౌక్ , రైల్వే స్టేషన్, బస్టాండ్ ,గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీ చౌక్, పులాంగ్ చౌరస్తా మీదుగా ఎల్ల మ్మ గుట్ట కమాన్, కోర్టు చౌరస్తా నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా సాయంత్రం 7 గం టల కు ఆర్మూర్ రోడ్డు లోని శ్రీరామ గార్డెన్ కు వరకు కొనసా గుతుందన్నారు.

శుక్రవారం శ్రీరామ గార్డెన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు

నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ లో శుక్రవారం సాయంత్రం సాంస్కృ తిక కార్యక్రమాలు, భజనలు, సంకీర్తనలు,జగన్నాథ స్వామి వారికి అభిషేకము, చప్పన్ భోగ్ నివేదనతో పాటు భక్తులం దరికీ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగు తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు శ్రీరామ గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

రథయాత్రలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు

శుక్రవారం నిర్వహించే జగన్నాథ రథయాత్ర మహోత్సవంలో మహి ళలు,పురుషులు ,పిల్లలు ,పెద్దలు, సమస్త భక్తజను లు వేలాది సంఖ్యలో హాజ రై స్వామివారి అనుగ్రహా నికి పాత్రులు కాగలరని వారు కోరారు. రథం పైన ఉన్న జగన్నాథుడిని దర్శించడం, జగన్నాథుడి రథాన్ని లాగటం వలన మళ్లీ జన్మను ఎత్తాల్సిన అవసరం లేకుండా మో క్షాన్ని భగవంతుడు అను గ్రహిస్తాడని మన పురాణాలు చెబుతున్నా యి. జగన్నాథుడు సమస్త లోకాని కి నాయకుడు ఆయన సమస్త దుఃఖాల నుంచి మన జీవితాన్ని అనుగ్ర హించేవాడు అటువంటి మహోన్నతమైన మహాదేవుడు రథయాత్ర మన నగరంలో జరగటం ఎంతో ఆనందించదగ్గ విషయం అని అన్నారు. ఈ రథయా త్రలో జిల్లాలోని అన్ని గ్రా మాల ప్రజలురథయాత్రకు వేల సంఖ్యలో విచ్చేసి స్వామివారి రథాన్ని లాగి పునీతులు కావాలని కోరారు.

రథాన్ని లాగడం.. సమస్త జన్మంతరాలలో చేసిన పాపాలు పరిహారం

జగన్నాథుడి రథాన్ని లాగడం ద్వారా సమస్త జన్మంతరాలలో చేసిన పాపాలు పరిహారం కావడ మే కాకుండా విశేషమైన పుణ్యము, స్వామి అను గ్రహం లభిస్తాయని ఎంతో మంది గురువులు తెలిపా రు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ రథయా త్ర మహోత్సవానికి హాజరై మన ఇందూరు నగర పురవీధు ల గుండా సాగే రథయా త్రను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానందరాయ్ గౌరదాస్, గంగారెడ్డి ప్రభు, మాదాసు స్వామి యాదవ్, రఘుపతి,రాధ రాజా గోపికేశ దాస్, బలరాం ప్రభు, సునీల్ ప్రభు, రోహిత్ ప్రభు, నవరూప ముకుంద దాస్ పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!