వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో.. -8న జనసేన పార్టీ రెండు జిల్లాల సన్నాహక సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 7: ప్రజా సంక్షేమమే జన సేన పార్టీ ధ్యేయమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలను నాయకు లుగా చేసేందుకే పుట్టిన పార్టీ అని వెల్లడించారు. జనసేన పార్టీ నిజామాబా ద్, జహీరాబాద్ జిల్లాల సన్నహాకా సమావేశం
వచ్చే ఎన్నికల్లో జనసేన బరిలో..
-8న జనసేన పార్టీ రెండు జిల్లాల సన్నాహక సమావేశం
జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) ఆగస్టు 7:
ప్రజా సంక్షేమమే జన సేన పార్టీ ధ్యేయమని జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు మీసాల శ్రీనివాసరావు అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలను నాయకు లుగా చేసేందుకే పుట్టిన పార్టీ అని వెల్లడించారు. జనసేన పార్టీ నిజామాబా ద్, జహీరాబాద్ జిల్లాల సన్నహాకా సమావేశం ఈనెల 8వ తేదీ నిజామా బాద్ జిల్లా కేంద్రంలోని సుగుణ గార్డెన్ లో నిర్వ హిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకుడు మీ సాల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీసా ల శ్రీనివాస్ రావు మాట్లాడా రు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి, జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసే న పార్టీ నుండి అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో జనసేన పార్టీ బలోపేతా నికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మీసాల శ్రీనివా సరావు తెలిపారు. రానున్న రోజులలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంలో, రాష్ట్రంలో కీల కంగా మారబోతున్నారన్నారు.8 వ తేదీన తేదీననిర్వహించబోయే సన్నాహక సమావేశానికి రాష్ట్రంలోని ముఖ్య నాయకు లందరూ విచ్చేస్తు న్నారని కార్యకర్తలు అందరూ పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర అబ్జర్వర్ శర్మ, మీడియా ఇన్ఛార్జ్ దుం పటి శ్రీనివాస్, జిల్లా నా యకుడు గుండా సంతోష్, కోరుట్ల నాయకులు అజ య్, ఉప సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు రమేష్ బాసవేణి తదితరులు పాల్గొన్నారు.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *