మహాలక్ష్మి పథకానికి పాతరేస్తున్న ఆర్టీసీ

మహాలక్ష్మి పథకానికి పాతరేస్తున్న ఆర్టీసీ

* TGSRTC సిబ్బంది బరితెగింపు... * రాత్రి వేళ మహిళా ప్రయాణికురాలి పట్ల దారుణ నిర్లక్ష్యం!.. కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, ఆగస్టు 20 : ​బాన్సువాడ డిపో సిబ్బంది వైఖరితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి' ఆశయానికే గండి పడుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సు అని చెప్పి బస్సులోకి ఎక్కించుకుని, కోరిన స్టాప్‌లో ఆపకుండా రాత్రి వేళ ఒక ఒంటరి మహిళను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘాతుకం బాన్సువాడ డిపో

  • * TGSRTC సిబ్బంది బరితెగింపు…
  • * రాత్రి వేళ మహిళా ప్రయాణికురాలి పట్ల దారుణ నిర్లక్ష్యం!..

కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, ఆగస్టు 20 :

​బాన్సువాడ డిపో సిబ్బంది వైఖరితో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’ ఆశయానికే గండి పడుతోంది. ఎక్స్‌ప్రెస్ బస్సు అని చెప్పి బస్సులోకి ఎక్కించుకుని, కోరిన స్టాప్‌లో ఆపకుండా రాత్రి వేళ ఒక ఒంటరి మహిళను తీవ్ర భయాందోళనలకు గురిచేసిన ఘాతుకం బాన్సువాడ డిపో పరిధిలో వెలుగుచూసింది. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన కండక్టర్, డ్రైవర్‌లతో పాటు వారిని వెనుకేసుకొస్తూ, మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించిన డిపో మేనేజర్ (DM) వైఖరిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

​*”మహిళలను గౌరవించడం మన సంప్రదాయం”–కేవలం బోర్డులకే పరిమితమా?..*

​”మహిళలను గౌరవించడం మన సంప్రదాయం”, “మహిళలకు ప్రాధాన్యం ఇద్దాం” అంటూ ఆర్టీసీ బస్సుల్లో పెద్ద పెద్ద అక్షరాలతో కొటేషన్లు రాయడం, ఉచిత ప్రయాణం పేరుతో ప్రచారాలు చేసుకోవడం వరకే ఆర్టీసీ యాజమాన్యం పరిమితమైంది. క్షేత్రస్థాయిలో మాత్రం మహిళల పట్ల గౌరవం దేవుడెరుగు..కనీస మానవత్వం కూడా లేకుండా స్వయంగా ఆర్టీసీ సిబ్బంది,డిపో మేనేజర్‌తో సహా అందరూ కలిసి ఆ నినాదాలను అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత మహాలక్ష్మి పథకం ఇచ్చినా, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన చూస్తుంటే మహిళలను గౌరవించాల్సింది పోయి, వారిని ఎగతాళి, హేళన చేస్తూ చిదరించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బాన్సువాడ డిపో సిబ్బంది వైఖరి ఈ విషయాన్ని మరొకసారి రుజువు చేసింది.

WhatsApp Image 2026 08 20 at 2.54.56 PM

​*స్టేజ్ ఉందో లేదో చెప్పకుండా ఎక్కించుకుని దారుణ అన్యాయం!*

​బుధవారం సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ బస్టాండ్‌లో బాన్సువాడ డిపోకు చెందిన TG17Z0100 నంబరు గల ఎక్స్‌ప్రెస్ బస్సును ఓ మహిళా ప్రయాణికురాలు చేయి చూపించి ఆపారు. తాను దుర్కి చౌరస్తా వద్ద దిగాల్సి ఉందని ముందే విజ్ఞప్తి చేయగా, కండక్టర్ ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు. ఒకవేళ అక్కడ ఎక్స్‌ప్రెస్ స్టేజ్ లేదని ముందే చెప్పి ఉంటే ఆ మహిళ ఆ బస్సు ఎక్కేదే కాదు. తీరా బస్సు బయలుదేరి దుర్కి చౌరస్తా దగ్గరకు వస్తున్న సమయంలో, బస్సు ఆపాలని కోరగా కండక్టర్ తన బాధ్యతను విస్మరించి “డ్రైవర్ వద్దకు వెళ్ళి అడగండి” అని చెప్పడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

*డ్రైవర్ బాధ్యతారాహిత్యం..*

* రాత్రి వేళ ఒంటరి మహిళ భయాందోళన!..

​కండక్టర్ చెప్పినట్లే ఆ మహిళ డ్రైవర్ వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేయగా, “బస్సు వేగంగా ఉంది, ఆపడం కుదరదు” అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారు. రాత్రి వేళ చీకటిపడిన తర్వాత మహిళ పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన సిబ్బంది, బస్సును దుర్కి చౌరస్తాలో ఆపకుండా నేరుగా బాన్సువాడకు తీసుకుపోయారు. దీంతో ఒంటరిగా ఉండిపోయిన ఆ మహిళ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ రాత్రి వేళ ఆ మహిళకు ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చివరకు బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు బాన్సువాడ బస్టాండ్ చేరుకుని ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు.

*కప్పిపుచ్చే యత్నంలో డిపో మేనేజర్..విలేకరిపై దురుసు ప్రవర్తన!*

​గురువారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యులు బాన్సువాడ డిపో మేనేజర్ (DM) రవికుమార్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయగా, “ఏ ధ్యాసలో ఉండి అలా చేశారో” అంటూ నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. ఈ ఘటనపై వివరణ కోరేందుకు ‘కబురు న్యూస్’ ప్రతినిధి డిపో మేనేజర్‌ రవికుమార్ ను సంప్రదించగా, ఆయన మరింత దురుసుగా ప్రవర్తించారు. విలేకరిని ఏకవచనంతో సంబోధిస్తూ,బాధ్యతారహితంగా మాట్లాడి కాల్ కట్ చేసేశారు. తప్పు చేసిన కండక్టర్, డ్రైవర్లపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారే ఇలా ప్రవర్తించడం మొత్తం ఆర్టీసీ నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోంది.

*ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి!*

​బోర్డుల మీద మాటలు రాయడమే కాదు,క్షేత్రస్థాయిలో మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. ఈ దారుణ ఘటనకు కారణమైన కండక్టర్, డ్రైవర్‌తో పాటు, ఫిర్యాదు చేసిన వారిని అలసత్వంగా సమాధానమిచ్చి మీడియా పట్ల మర్యాద లేకుండా ప్రవర్తించిన బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్‌పై ఆర్టీసీ ఉన్నతాధికారులు, తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!