భరత్ చంద్ర హైస్కూల్‌ లో అక్రమంగా ఉర్దూ భాష విధింపు..

తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో ఏబీవీపీ వినతి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 29: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. విద్యార్థులపై బలవంతం గా భాషను రుద్దడం విద్యా చట్టాల ఉల్లంఘనే.. అని భరత్ చంద్ర హైస్కూల్‌ లో అక్రమంగా ఉర్దూ భాష విధింపుపై విచారణ చేప ట్టి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు. సోమ వారం ప్రజావాణిలో ఏబీ వీపీ ఆధ్వర్యంలో వినతి

తక్షణమే చర్యలు తీసుకోవాలి

ప్రజావాణిలో ఏబీవీపీ వినతి

WhatsApp Image 2026 06 30 at 8.18.10 AM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 29:

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. విద్యార్థులపై బలవంతం గా భాషను రుద్దడం విద్యా చట్టాల ఉల్లంఘనే.. అని భరత్ చంద్ర హైస్కూల్‌ లో అక్రమంగా ఉర్దూ భాష విధింపుపై విచారణ చేప ట్టి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు. సోమ వారం ప్రజావాణిలో ఏబీ వీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ మాట్లాడారు నిజామాబాద్ జిల్లా ఆ ర్మూర్ మున్సిపల్ పరిధి లోని కోటార్మూర్ ప్రాం తంలో గల “భరత్ చంద్ర హైస్కూల్” యాజమా న్యం, ప్రిన్సిపాల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండింస్తుంది అన్నారు. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువు తున్న విద్యార్థులపై, వారి తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేకుండా బల వంతంగా ఉర్దూ భాషను రుద్దుతున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అనుమతించిన అధికా రిక సిలబస్, లాంగ్వేజ్ పాలసీకి పూర్తిగా భిన్నంగా భరత్ చంద్ర హైస్కూల్ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుం టోందని ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత నిబంధనలతో విద్యార్థులపై ఇష్టాను సారంగా భాషలను రుద్దడం విద్యా చట్టాలను ఉల్లంఘించడమే అవు తుందని స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆం దోళనకు, మానసిక ఒత్తి డికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు పాఠశాలలో ప్రభు త్వ నిబంధనల ప్రకారం థర్డ్ లాంగ్వేజ్ గా ఏ భాష కు అనుమతి ఉందో విద్యాశాఖ అధికారుల ద్వారా తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరిపిం చాలన్నారు.విద్యా చట్టాలను ఉల్లంఘించి, విద్యార్థులపై మానసిక ఒత్తిడి తెచ్చిన పాఠశాల ప్రిన్సిపాల్, యాజమా న్యంపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో జిల్లాలోని ఏ ప్రైవేట్ పాఠశాల కూడా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీ సుకోకుండా జిల్లా యం త్రాంగం ప్రత్యేకఆదేశాలు జారీ చేయాల న్నారు . విద్యార్థుల భవిష్యత్తును, విద్యా నిబంధనలను కాపాడటానికి జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి, తగి న న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుం దన్నారు లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రు లను సమీకరించి పాఠ శాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమం లో ప్రవీణ్ కుమార్,చెర్రీ, కుల్వంత్, సౌరాబ్, దీపాన్, సిద్దు, రాజేష్, గుడ్డు, బాలు, శశాంక్, రక్షిత తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2026 06 30 at 8.18.09 AM

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!