👉వ్యక్తిగత విమర్శలు.. చౌక బారు మాటలు పక్కనపెట్టి.. 👉దమ్ముంటే అభివృద్ధి చేయండి.. 👉పైరవీలు చేసి పదవులు తెచ్చుకోవడం కాదు. 👉దమ్ముంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చెయ్యు 👉నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. 👉మీ చేతకానితనంతో జిల్లా నష్టపోతోంది.. 👉సీఎం, టీపీసీసీపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 2: కాంగ్రెసోళ్లు పదేపదే విమ ర్శలు చేయడం.. చౌకబా రు
👉వ్యక్తిగత విమర్శలు.. చౌక బారు మాటలు పక్కనపెట్టి..
👉దమ్ముంటే అభివృద్ధి చేయండి..
👉పైరవీలు చేసి పదవులు తెచ్చుకోవడం కాదు.
👉దమ్ముంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చెయ్యు
👉నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
👉మీ చేతకానితనంతో జిల్లా నష్టపోతోంది..
👉సీఎం, టీపీసీసీపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 2:
కాంగ్రెసోళ్లు పదేపదే విమ ర్శలు చేయడం.. చౌకబా రు మాటలు మాట్లాడడం తప్ప.. అభివృద్ధి చేయని చేతగాని ప్రభుత్వమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఎప్పుడు పదవి ఊడు తుందో తెలియక రేవంత్ రెడ్డి ఎగిసెగసి పడుతుందని విమర్శిం చారు. బిజెపి నేత నితిన్ నవీన్ పై మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నితిన్ నవీన్ బిజెపిలో ఒ క కార్యకర్త స్థాయి నుంచి పలుమార్లు ఎమ్మె ల్యేగా గెలిచి జాతీయ సాయి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అని ఆర్మూర్ ఎమ్మె ల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. అలాంటి వ్యక్తి ని విమర్శించే స్థాయి నీది కాదు అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రం లోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆర్మూ ర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. మతి భ్రమించి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుందో తెలియడం లేదని అన్నా రు. వాళ్ల మీద ..వీళ్ళ మీద విమర్శలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నువ్వేం చేశావని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిసారి కేంద్రాన్ని విమర్శించడం తప్ప తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న అవినీతికి అడ్డు వస్తున్నా మని బిజెపిపై ఆరోపణలు చేస్తున్నారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చే యాల్సిన రాష్ట్ర ముఖ్య మంత్రి కొన్ని జిల్లాలకే అభివృద్ధి పథకాలను, నిధులు ఇవ్వడం ఏమి టని ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పామా యిల్ ఫ్యాక్టరీ తీసుకురా వాలని ఎంతో శ్రమించి మంత్రుల దృష్టికి తీసు కెళ్తే.. అది కాస్త కొడంగల్ కి తీసుకెళ్లడం ఏమిటి అ ని రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మండి పడ్డారు. మూసి ఉన్న ఫ్యా క్టరీలను ఇతర జిల్లాలో ప్రారంభించేలా చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తూ ఉంటే… మరి నిజామా బాద్ జిల్లా ఏం పాపం చే సింది అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆర్మూర్ ని యోజకవర్గ సంబంధించి అభివృద్ధికి 208 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధికి సంబంధించి పదేపదే అసెంబ్లీలో మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చిన… పట్టించుకున్న దాఖలాలు లేవని రాకేష్ రెడ్డి తీవ్రస్థా యిలో ధ్వజమెత్తారు. కా ర్ఖానాలో ఆడబిడ్డలు బీడీ లు చేయడం.. పొట్ట చేత పట్టుకొని యువకులు గల్ఫ్ బాట పడుతున్నా రనీ. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పాలిట శాపంగా యూరియా యాప్
రైతుల పాలిట యూరియా యాప్ శాపంగా మారిం దని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ధాన్యం కొను గోలు యూరియా పంపి ణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి పగబ ట్టిండ్రని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించాడు.
ఫైరవిలు చేసి పదవులు తెచ్చుకోవడం కాదు..
దమ్ముంటే టిపిసిసి రాజీనామా చెయ్యూ
ఢిల్లీలో పైరవీలు చేసి.. పదవులు తెచ్చుకోవడం కాదు… అభివృద్ధి ఏం చేశావని టీపీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకా కుండా దమ్ముంటే రాజీనా మా చేయాలని టిపిసిసి అధ్యక్షులకు పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు.నేను ఎమ్మెలే పదవికి రాజీనా మా చేసి పోటీ చేస్తానని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఇన్ని సంవత్స రాలుగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసారి కూడా బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ గెలవలేడని రాకేష్ రెడ్డి ఆరోపించారు.పీసీసీ చీఫ్ గా ఉండి కూడా నిజా మాబాద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని విమ ర్శించా రు. ప్రజల ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేను ఎమ్మెల్యేనని రాకేష్ రెడ్డి తెలిపారు. కానీ పైరవీలు చేసి తెచ్చుకున్న పదవి కాదని ఘాటుగా వ్యాఖ్యా నించారు. ఇతర జిల్లాలకు నిధులు తీసుకెళ్తుంటే ను వ్వేం చేస్తున్నావని మహే ష్ కుమార్ గౌడ్ ని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. టిపిసిసి హోదాలో సొంత జిల్లాకు నువ్వేం చేసావో సమాధా నం చెప్పాలని ప్రశ్నించా రు. చేతకా కపోతే రాజీనా మా చేయాలి. మీ చేతగా నితనంతో నిజామాబాద్ జిల్లా తీవ్రంగా నష్టపో తుందని ఎమ్మె ల్యే రాకేష్ రెడ్డి వాపోయారు.
కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి..
కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లా డాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరిం చారు. బాల్కొండలో పలుమార్లు పోటీ చేసి ఓడిపోయిన ఈరవత్రి అనిల్.. అసలు బా ల్కొండ కు ఏమి చేశావని మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు చౌకబారు మాటలు పక్కనపెట్టి అభివృద్ధి చేసి చూపెట్టండని రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు.
చౌకబారు మాటలు మానుకో..
ఆర్మూర్ పాండు చౌకబారు మాటలు ఇక మానుకో అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హితవు పలికారు. ఆర్మూర్ ని యోజకవర్గంలో నువ్వేం టో అందరికీ తెలుసునని ఇప్పటికైనా మారాలని రాకేష్ రెడ్డి హెచ్చరించా రు.
రాముడు గురించి మాట్లాడే హక్కు కాంగ్రెసో ళ్ళకు లేదు..
అయోధ్య రాముడిపై మా ట్లాడే హక్కు కాంగ్రెసోళ్ళ కు లేదని ఆర్మూర్ ఎమ్మె ల్యే రాకేష్ రెడ్డి ఘాటుగా మాట్లాడారు. మేము రా ముడి వారసులమని.. మీ రు రావణుడి వారసులని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఎప్పుడైతే అయోధ్యలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ రాముడి దర్శనం చేస్తారో.. అప్పటివరకు రాముడిపై మాట్లాడే హక్కు మీకు లేదని అన్నారు.
జిల్లాను అభివృద్ధి చేసి చూపించండి..
రాష్ట్ర మంత్రులతో కలిసి జిల్లా అభివృద్ధిపై వెంటనే రివ్యూ ఏర్పాటు చేసి జిల్లా ని అభివృద్ధి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభు త్వం వ్యక్తిగత విమర్శ లు.. చౌకబారు మాటలు పక్కనపెట్టి… జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించే లా ప్రత్యేక చర్యలు చేప ట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నొక్కి చెప్పారు. ఈ సమావే శంలో ఎస్సీ మోర్చా, కిసాన్ మో ర్చా నాయకులు ,బిజెపి రాష్ట్ర నాయకులు నాగోల్ల లక్ష్మి నారాయణ, ప్రమోద్ కుమార్, బొబ్బిలి వేణు, స్వామి యాదవ్, నూతుల శ్రీనివాస్, చింత శ్రీనివాస్, ఓం సింగ్, పోల్కం వేణు, పడాల భూపతి, మఠం పవణ్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *