బాన్సువాడ ఆర్టీసీ ‘జేఏసీ’ పైశాచిక ఆనందం!

బాన్సువాడ ఆర్టీసీ ‘జేఏసీ’ పైశాచిక ఆనందం!

ఓ మహిళకు జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చే కుట్ర.. 'కబురు' కథనంపై బురదజల్లే యత్నం!... జేఏసీ అంటే బాధ్యతా? బాధ్యతారాహిత్యమా? ప్రయాణికురాలిపై 'బదనాం' రాజకీయం!... కనీస సంప్రదింపులు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం తగదంటూ ప్రజల హెచ్చరిక... డిపో మేనేజర్ రవికుమార్ దురుసుతనంతోనే చెలరేగిన వివాదం... మహాలక్ష్మి పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనానికి 'కబురు న్యూస్' కట్టుబడి ఉందన్న ప్రతినిధి... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్/బాన్సువాడ,ఆగస్టు 21 : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత

  • ఓ మహిళకు జరిగిన అవమానాన్ని కప్పిపుచ్చే కుట్ర.. ‘కబురు’ కథనంపై బురదజల్లే యత్నం!…
  • జేఏసీ అంటే బాధ్యతా? బాధ్యతారాహిత్యమా? ప్రయాణికురాలిపై ‘బదనాం’ రాజకీయం!…
  • కనీస సంప్రదింపులు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం తగదంటూ ప్రజల హెచ్చరిక…
  • డిపో మేనేజర్ రవికుమార్ దురుసుతనంతోనే చెలరేగిన వివాదం…
  • మహాలక్ష్మి పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనానికి ‘కబురు న్యూస్’ కట్టుబడి ఉందన్న ప్రతినిధి…

కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్/బాన్సువాడ,ఆగస్టు 21 :

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో మహిళలకు జరుగుతున్న తీవ్ర నిర్లక్ష్యం, అవమానాలపై ‘కబురు’ తెలుగు దినపత్రిక నిజాయితీగా ప్రచురించిన ప్రత్యేక కథనంపై బాన్సువాడ ఆర్టీసీ డిపో ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్ర అసహనం ప్రదర్శిస్తోంది. ఓ బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెస్తే, అసలు విషయాన్ని లోతుగా పరిశీలించకుండా కబురు న్యూస్‌పై సాంఘిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తూ జేఏసీ సభ్యులు పైశాచిక ఆనందం పొందుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*గొడ్డలి దాకా తెచ్చుకున్న అధికార దర్పం!*

వార్తా కథనాన్ని ప్రచురించడానికి ముందే కబురు న్యూస్ ప్రతినిధి బాన్సువాడ డిపో మేనేజర్(డిఎం)రవికుమార్‌ను సంప్రదించి వివరణ కోరడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన అధికారిగా అక్కడికక్కడే సమస్యను పరిష్కరించి సద్దుమణిగేలా చేయాల్సిన డిపో మేనేజర్, ప్రయాణికురాలి పట్ల మరియు విలేఖరి పట్ల దురుసుగా వ్యవహరించడంతోనే సమస్య మరింత తీవ్రతరమైంది. ‘గోటితో పోయే సమస్యను గొడ్డలి వరకు తెచ్చుకోవడం’ అంటే ఇదేనని, అధికారుల అలసత్వం మరియు దురుసుతనమే వివాదానికి మూలకారణమని స్పష్టమవుతోంది.

*నాణేనికి రెండో వైపు ఆలోచించే ఇంగితం లేదా?*

ఆర్టీసీలో కార్మికులు,ప్రయాణికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన జేఏసీ.. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుండటంపై బాన్సువాడ ప్రజలు మండిపడుతున్నారు. సమస్య తలెత్తినప్పుడు బాధిత మహిళా ప్రయాణికురాలి వైపు ఏం జరిగిందో ఆలోచించే కనీస ధ్యాస జేఏసీకి లేకపోవడం శోచనీయం. అసలు ఆ మహిళతో గానీ, ఆమె కుటుంబంతో గానీ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా ఆమె క్యారెక్టర్‌ను బదనాం చేస్తూ కరపత్రాలు విడుదల చేయడం ఏ రకమైన న్యాయమని నిలదీస్తున్నారు.

WhatsApp Image 2026 08 21 at 6.18.11 PM
*‘ఆర్డినరీ ఉండగా ఎక్స్‌ప్రెస్ ఎక్కింది’ అని అనడం పచ్చి అబద్ధం!*

సదరు మహిళ కావాలనే ఎక్స్‌ప్రెస్ బస్సు ఎక్కి,బాన్సువాడ టికెట్ తీసుకుని,దుర్కి రాంపూర్ దగ్గర ఆపడానికి ప్రయత్నించి ఉద్దేశపూర్వకంగా వివాదానికి తెరతీసిందంటూ, జేఏసీ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని ప్రయాణికులు కొట్టిపారేస్తున్నారు. జేఏసీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ,అంగబలంతో భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం కరపత్రం ద్వారా చేస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

*‘కబురు న్యూస్’ నిజాయితీకి కట్టుబడి ఉంది!*

బాధిత మహిళకు జరిగిన ఘోర అవమానంపై ‘కబురు న్యూస్’ రాసిన కథనానికి పూర్తి కట్టుబడి ఉందని ప్రతినిధి స్పష్టం చేశారు. బెదిరింపులకు, సాంఘిక మాధ్యమాల దుష్ప్రచారాలకు వెరచేది లేదని తేల్చి చెప్పారు.ఇప్పటికైనా బాన్సువాడ ఆర్టీసీ జేఏసీ మరియు డిపో మేనేజర్ తమ అనాలోచిత, దురుసు వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని బాధితురాలికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆర్టీసీ డిపో ఎదుట ప్రయాణికులంతా ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని ప్రజలు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!