కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 : ఏసీబీ అధికారుల దాడులతో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలవరం మొదలైంది.అక్రమ సంపాదనలో ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి కంటే ముదురు(తిమింగిలాలు)అధికారులు మరికొందరు ఉన్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపడితే ఆ కొందరు అవినీతి పరుల బాగోతం బహిర్గతం కావడం ఖాయమని అబ్కారీ శాఖలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖను నవ్వుల పాలు చేస్తున్నాయి.తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్
కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 :

ఏసీబీ అధికారుల దాడులతో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలవరం మొదలైంది.అక్రమ సంపాదనలో ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి కంటే ముదురు(తిమింగిలాలు)అధికారులు మరికొందరు ఉన్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపడితే ఆ కొందరు అవినీతి పరుల బాగోతం బహిర్గతం కావడం ఖాయమని అబ్కారీ శాఖలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖను నవ్వుల పాలు చేస్తున్నాయి.తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అవినీతి వ్యవహారాలను ఏసీబీ అధికారులు బట్ట బయలు చేశారు.అయితే ఆయనకు మించి ఈ శాఖలో మరి కొన్ని అవినీతి తిమింగిలాలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తీవ్ర చర్చ జరుగుతోంది.డిప్యూటేషన్ పై ఉన్న స్థానిక ఎక్సైజ్ అధికారి అవినీతి వ్యవహారం చూస్తే కళ్ళు బైర్లు కమ్మేలా ఉన్నాయి.ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సీఐగా ఉన్న సదరు అధికారి కన్ను,స్థానిక కుర్చీపై పడింది.ఇంకేముంది ఆ కుర్చీలో ఉన్న అధికారిపై ఆ శాఖలో అవినీతి పుకార్లు పుట్టించి చెక్ పోస్ట్ విధులకు పథకం ప్రకారం బదిలీ అయ్యేలా చేశారు.ఆ తర్వాత దర్జాగా ఆ కుర్చీలో కూర్చుని మామూళ్ల మత్తులో తూగుతున్నారు.ఇందుకుగాను ఏకంగా ఓ కానిస్టేబుల్ తో కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే ఆల్ఫాజోలం దందా చేయించినట్లు తీవ్ర ఆరోపణలు కూడా సదరు స్థానిక అధికారిపై ఉన్నాయి.ఆదిలాబాద్ నుంచి రాజకీయ అండతో దొడ్డి దారిన నిజామాబాదుకు వచ్చిన ఓ హెడ్ కానిస్టేబుల్ ను తనకు నమ్మకస్తుడిగా మలచుకొని మామూళ్ల వసూళ్లకు ఉసిగొలిపినట్లు ఆ శాఖలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.నిజామాబాద్ స్థానిక ఎక్సైజ్ అధికారి పరిధిలో నందిపేట,నవీపేట,మాక్లూర్,మోపాల్,నిజామాబాద్ రూరల్ మండలాలు అక్రమ ఆదాయపరంగా ఈ కుర్చీకి కాసులు కురిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.కల్లు డిపోలు,కల్లు దుకాణాల నుంచి ప్రతి నెల ఆ అధికారి ఐదు లక్షలు,ఈ మండలాల పరిధిలోని 30 వైన్స్ ల నుంచి ప్రతి నెల ఒక్కో వైన్స్ నుంచి 30 వేల చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు ఆ శాఖలో తీవ్ర దుమారం రేపింది.ఇలా ఈ రెండు దొడ్డి దారుల్లో 20 లక్షల వరకు చేతులు మారుతుండగా,బెల్ట్ షాపుల నుంచి వచ్చే ఆదాయం అదనంగా చెప్పుకోవచ్చు.ఇంత భారీ మొత్తంలో అవినీతి సొమ్ము కాజేస్తున్నా,రాజకీయ అండదండల కారణంగా ఆ అవినీతి అధికారిని ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయినట్లు తెలుస్తుంది.
*జిల్లా కేంద్రంలో బార్లను తలపిస్తున్న వైన్సులు..*
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వైన్స్ ల పరిస్థితి చూస్తే,బార్లను తలదన్నే విదంగా ఉన్నాయి.ఎక్సైజ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్ లను నిర్వహిస్తూ,ప్రతి నెల టంచన్ టంచన్ గా సదరు అధికారికి లంచాలు ముట్ట చెబుతున్నారు.బార్లలో మాదిరిగా పర్మిట్ రూమ్ లలో మటన్,చికెన్,చేపలతో వెరైటీ ఫుడ్ అందుబాటులోకి తీసుకు రావడంతో,ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు చెల్లిస్తున్న బార్ల నిర్వాహకులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.డిప్యూటేషన్ పద్ధతిలో స్థానిక అధికార కుర్చీని చేజెక్కించుకున్న ఆ అవినీతి అధికారి,ఉన్నతాధికారుల తలదన్నేలా వరంగల్లో బహుళ అంతస్తుల భారీ భవంతిని నిర్మించినట్లు విశ్వసనీయ సమాచారం.ప్రతి నెల వైన్సులు,కల్లు దుకాణాల నుంచి వచ్చే మామూళ్ల లెక్కను డైరీలో రాసుకొని మరి దర్జాగా వసూళ్లకు పాల్పడుతూ,ఏసీబీ అధికారులకు సైతం ఆ స్థానిక ఎక్సైజ్ అధికారి సవాల్ విసురుతున్నట్లుగా అనిపిస్తున్నది.కార్యాలయానికి వచ్చే పోయే వాళ్ళతో నా వెనక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుని అండదండలు ఉన్నాయని,స్థానిక బడా కల్లు కాంట్రాక్టర్లతో బలమైన పరిచయాలున్నాయని,నన్నెవరూ ఏమి చేయలేరన్న అహంబావం కూడా ఆ అవినీతి అధికారి మాటల్లో వ్యక్తం చేయడం గమనార్హం.నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖపై మరో దఫా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించి మరింత లోతైన విచారణ చేపడితే అసలు నిజాలు బహిర్గతం అవుతాయని ఎక్సైజ్ శాఖలోని సిబ్బందే చర్చించుకోవడం విశేషం.ఇక రాష్ట్ర అవినీతి నిరోధక శాఖా అధికారులు మరో మారు నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో మల్లారెడ్డిని మించి ఉన్న అవినీతి తిమింగిలాలపై ఏ రకమైన దూకుడు ప్రదర్శిస్తారో వేచి చూడవలసిందే మరి..
*ఆ అధికారి నెలవారి మాముళ్ల డైరీ*

స్థానిక ఎక్సైజ్ అవినీతి ఆ అధికారి స్వయంగా తన చేతులతో నెలవారి మాముళ్లను రాసి పెట్టుకున్న బాగోతం బయటికొచ్చి చక్కర్లు కొడుతోంది..మాముళ్ల బాగోతమంతా ఆ డైరిలోనే ఉన్నదని సిబ్బంది బహాటంగానే వాడివేడిగా చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఆ డైరీ దొరికితే లక్షల్లో మాముళ్ల చిట్టా బయటపడే అవకాశముందని స్వయంగా సిబ్బందే చెప్పుకోవడం గమనార్హం..అక్రమ అవినీతి సొమ్ముకు అలవాటు పడి మల్లారెడ్డినే తలదన్నే విదంగా ఉన్న ఈ అవినీతి తిమింగిలాలు రాష్ట్ర ఏసీబి ఉన్నతధికారుల గాలానికి చిక్కుతారో లేదో చూడవలసిందే మరి.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *