👉 గృహ నిర్బంధంలో ఉన్నా… నా దీక్ష కొనసాగుతుంది 👉 ప్రజా సమస్యల పరి ష్కారం కోసమే శాంతియుత దీక్ష.. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికం 👉 భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా? 👉 ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో హామీ ఇవ్వాలి మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ ప్రజల
👉 గృహ నిర్బంధంలో ఉన్నా… నా దీక్ష కొనసాగుతుంది
👉 ప్రజా సమస్యల పరి ష్కారం కోసమే శాంతియుత దీక్ష.. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికం
👉 భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా?
👉 ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో హామీ ఇవ్వాలి
మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15:
బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన శాంతియుత ‘కఠోర నిరాహార దీక్ష’ను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్య అని బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియ జేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.గత ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కె ట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారం భించాలని కోరారు. గత మున్సిపల్ ఎన్నికల ముం దు రూ. 12 కోట్ల నిధుల తో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయడం తప్ప?
పెండింగ్ పనుల సాధన కోసం చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు పూ నుకున్నట్లు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా… శాంతియు తంగా ఒకరోజు దీక్ష చేస్తా నని ప్రకటిస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడు తోం దని ఎమ్మెల్యే ప్రశ్నించా రు.
_ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శనం
తాను ఉదయం నిద్రలేవక ముందే, కనీసం స్నానం కూడా చేయక ముందే వందలాది మంది పోలీ సులు తన ఇంటిని చుట్టు ముట్టి తనను బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కార్య కర్తలను ఎక్కడిక క్కడ అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నారని, భీంగల్ లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని తొల గించి, ఫ్లెక్సీలను సైతం చించేయడం ప్రభుత్వ రాక్షసత్వానికి నిదర్శన మన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
ప్రభుత్వానికి నిజంగా ప్రజ ల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఈ అభివృద్ధి పనులను నెల లేదా రెండు నెలల్లో పూర్తి చేస్తామని అధికారి కంగా స్పష్టమైన హామీ ఇస్తే తాను తక్షణమే ఈ ఒక్కరోజు చేపట్టిన దీక్ష విరమిస్తానని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. అది చేతకాక, పోలీసులతో బెదిరిస్తే భయపడేది లేదని తేల్చి చెప్పారు. ప్రజా ప్రతినిధి గా ప్రజల పక్షాన పోరాడా ల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
నిరాహార దీక్ష కొనసాగుతుంది
తనను ఇంట్లో నిర్బంధిం చినా, పోలీస్ స్టేషన్ కు తరలించినా, లేదా జైల్లో పెట్టినా తన సత్యాగ్రహం, కఠోర నిరాహార దీక్ష ఎక్క డ ఉంటే అక్కడే కొనసా గుతుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భీంగ ల్ పట్టణ, మండల ప్రజ లు, యువత, కుల సం ఘాలు, వీడీసీ సభ్యులు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలందరూ ఈ న్యాయ మైన పోరాటానికి, నిరా హార దీక్షకు మనస్ఫూర్తిగా మద్దతు తెలపాలని వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *