అంతర్గాం, అంబారీపేట ల వద్ద అండర్ పాస్ లు మంజూరు ఎంపీ అర్వింద్ ధర్మపురి కి లేఖ ద్వారా తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీ అర్వింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23: జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామా బాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డారు.జగిత్యాల–కరీంనగర్ జాతీయ
అంతర్గాం, అంబారీపేట ల వద్ద అండర్ పాస్ లు మంజూరు
ఎంపీ అర్వింద్ ధర్మపురి కి లేఖ ద్వారా తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీ అర్వింద్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23:
జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామా బాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డారు.జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారి ( ఎన్హెచ్ -563) అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు కుందని ఎంపీ ఈ సందర్భంగా తెలిపారు. అంబారి పేట్, అంతర్గాం గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం తాను కేంద్ర రహ దారులు, రవాణా శాఖ దృష్టికి తీసుకెళ్లిన అం శంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అధికారిక స్పందన వచ్చినట్లు తెలిపారు.

బైపాస్ నిర్మాణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
జగిత్యాల–కరీంనగర్ రహదారిని 4 లేన్లుగా విస్తరించడంతో పాటు జగిత్యాల పట్టణానికి బైపాస్ నిర్మాణ ప్రతిపా దనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ వెల్లడించారు. అంతేకాకుండా అంత ర్గాం, అంబారీపేట గ్రా మాల వద్ద అండర్ పాస్ ల నిర్మాణానికి సైతం ఆమోదం లభించింద న్నారు.ఈ పనులు పూర్త యిన అనంతరం ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అం దుబాటులోకి వస్తా యని తెలిపారు. జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకా రంతో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి నిరంతరం కృషి కొనసాగి స్తానని ఎంపీ అరవింద్ ధర్మపురి పేర్కొన్నారు. జిల్లా ప్రజల తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *