ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాల యానికి తెలంగాణ ప్రభు త్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతిం చదగ్గ నిర్ణయమని నిజా మాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయిం పును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ.

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3:
జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాల యానికి తెలంగాణ ప్రభు త్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతిం చదగ్గ నిర్ణయమని నిజా మాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయిం పును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన ట్లు శుక్రవారం ఒక ప్రకట నలో ఎంపీ వెల్లడించారు.కేంద్ర విద్యాలయ సంఘం నిబంధనల ప్రకారం 5 ఎక రాలు కనీస అవసరమే కాగా, మెట్రో నగరాల వెలుపల ఉన్న కేంద్ర విద్యాలయాలకు 10 ఎక రాలు అనువైన ప్రమాణ మని ఆయన ఎంపీ పేర్కొ న్నారు. అదనపు భూమి ఉంటే విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్య త్తు విస్తరణకు అవసర మైన మౌలిక సదుపాయా లను కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.
జగిత్యాల జిల్లా విద్యార్థు లకు నాణ్యమైన విద్యా వాతావరణం అందించా లనే ఉద్దేశంతో గతంలోనే 10 ఎకరాల భూమి కేటా యించాలని ఎంపీ కోరారు. విద్యార్థుల దీర్ఘ కాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వం ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించి భూ కేటాయిం పును 10 ఎకరాలకు పెంచాలని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *