మా నాయకుడి పై మాట్లాడితే… ఖబర్దార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కృషి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీదా ? దమ్ముంటే రాకేష్ రెడ్డి రాజీనామా చెయ్ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఊరుకోమని డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్ జిల్లా
మా నాయకుడి పై మాట్లాడితే… ఖబర్దార్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కృషి
ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీదా ?
దమ్ముంటే రాకేష్ రెడ్డి రాజీనామా చెయ్
డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3:
తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఊరుకోమని డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, టిపిసిసి అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, డిసిసి అధ్యక్షులు రామకృష్ణలతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిసిసి అధ్య క్షులు నగేష్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవం త్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లపై ఆర్మూ ర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంట నే వెనక్కి తీసుకోవాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని విమ ర్శిం చే స్థాయి నీదా అని రాకేష్ రెడ్డి నీ ప్రశ్నించారు. జాతీయ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి ముఖ్య మంత్రి పై తప్పుగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి అందుకు స్పందించారు. కానీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని విమ ర్శించే స్థాయి నీది కాదని అన్నారు.
మా నాయకులు టీపీసీసీపై విమర్శలు చేస్తే ఖబర్దార్..
మా నాయకులు టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పై విమర్శలు చేస్తే ఖబర్దార్ అని డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి హెచ్చరించారు.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తాతల కాలం నుండి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయని వారు ఎంతో మందికి దానధర్మాలు చేస్తున్నారని ఇటీవల భీంగల్ లో స్కూల్ నిర్మా ణానికి 11 ఎకరాల భూ మిని ఇచ్చిన గొప్ప వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ అని నగేష్ రెడ్డి తెలిపారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని రాజీ నామా చేసి ఎన్నికలకు రమ్మని సవాల్ విసిరావు కదా నువ్వు రాజీనామా చేయు నీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తామనీ నగేష్ రెడ్డి సవాల్ విసి రారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని నువ్వు.. కేవలం 5 వార్డు లు గెలిచి ఇప్పుడు మహే ష్ కుమార్ గౌడ్ ని రాజీ నామా చేయమని మాట్లా డుతున్నావా.నీపై పోటీకి మహేష్ కుమార్ గౌడ్ కాదు జిల్లా నాయకులం మేం సరిపోతాం అని రెడ్డి అన్నారు.మహేష్ కుమార్ గౌడ్ ,సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అన్ని మున్సిపల్ సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుందన్నారు.జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీ ,అగ్రికల్చర్ కాలేజీ తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. జిల్లా అభివృద్ధిపై రాకేష్ రెడ్డి సిద్ధంగా ఉం డాలని సవాల్ విసిరారు.
నీట్ పేపర్ లీకేజీ పై ఒక్కసారైనా మాట్లాడావా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ తో విద్యార్థులు ఆత్మహత్య లు చేసుకుంటే యువకు లు రోడ్లపైకి వచ్చి ఆందో ళన చేశారు. ఒక్కసారైనా లీకేజీ పై మాట్లాడవా అని ప్రశ్నించారు.
_పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే వాటిపైన ఏరోజైనా స్పందించావా..?
నరేంద్ర మోడీ సంవత్స రానికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు వాటిని విస్మరిం చడం జరిగింది. దానిపై ఎందుకు రాకేష్ రెడ్డి మాట్లాడడం లేదన్నారు.మోడీ ప్రతి ఒక్కరికి రూ 15 లక్షల రూపాయలను ఇస్తానని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేరే లేదు.వీటన్నింటి పైన కేం ద్రంలో మోడీని అడగ డానికి వెళ్దాం.. మీతో పాటు మేము వస్తాము నగేష్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే అనుచిత వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేక నే రాకేష్ రెడ్డి కేవలం ఆయన ఉనికిని కాపాడు కోవడానికి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిపై అను చిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోప ణలను విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో నూడ చైర్మన్ కేశ వేణు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మాజీ మున్సిపాల్ ఫ్లోర్ లీడర్ రాజేం ద్ర ప్రసాద్,జిల్లా కాంగ్రెస్ ఉపా ధ్యక్షులు రత్నాకర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్స లం, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా సేవా దళ్ అధ్య క్షులు సంతో ష్,జిల్లా ఎస్టి అధ్యక్షులు యాదగిరి,జిల్లా కార్యద ర్శులు గణేష్, సుభాష్, పుప్పాల రవి,వినోద్, ఏఎంసీ డైరెక్టర్ రఘు,బం టు బలరాం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *