నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న లీవ్ లొల్లి..!! ఈఎస్ మల్లారెడ్డి రిమాండ్ తదనంతర పరిణామాలపై గుసగుసలు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 09 : జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబి దాడులతో గత కొద్దిరోజులుగా రేగుతున్న దుమారం మరింత ముదురుతోంది.అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పట్టుబడి,రిమాండ్‌కు వెళ్లిన తదనంతర పరిణామాలు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఎచ్ఓ),సీఐ స్వప్న సుదీర్ఘ సెలవుపై వెళ్లడం,తాజాగా ఆమె
- నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న లీవ్ లొల్లి..!!
- ఈఎస్ మల్లారెడ్డి రిమాండ్ తదనంతర పరిణామాలపై గుసగుసలు…
కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 09 :
జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబి దాడులతో గత కొద్దిరోజులుగా రేగుతున్న దుమారం మరింత ముదురుతోంది.అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పట్టుబడి,రిమాండ్‌కు వెళ్లిన తదనంతర పరిణామాలు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఎచ్ఓ),సీఐ స్వప్న సుదీర్ఘ సెలవుపై వెళ్లడం,తాజాగా ఆమె తన సెలవును మళ్లీ పొడిగించుకోవడం జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
*’మామూళ్ల’ చిట్టా కలకలం.. సీఐ వైపే వేళ్లు..!!*
ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలతో పాటు పలు పత్రికలలో,ప్రధాన వార్తా ఛానళ్లలో ఒక ‘చేతిరాత చిట్టా’కు సంబంధించిన వివరాలు ప్రముఖంగా ప్రసారమై హల్‌చల్ చేశాయి.అక్రమార్కుల నుంచి వసూలు చేసిన లంచాల వివరాలు ఆ చిట్టాలో ఉన్నట్లు తెలుస్తుండగా..ఈ వ్యవహారంలో సదరు చేతిరాత సిఐ స్వప్నదేనంటూ గట్టిగా ప్రచారం సాగుతోంది.గతంలో స్మగ్లర్ల కారు దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృత్యువాత పడిన దారుణ ఘటన మళ్లీ ఈ అవినీతి వ్యవహారాల వల్ల తెరపైకి వచ్చింది.జిల్లా ఎక్సైజ్ శాఖ ప్రతిష్ట ఇలా పూర్తిగా మసకబారడానికి సిఐ స్వప్న వ్యవహార శైలే మూలకారణమంటూ,తోటి సిబ్బంది అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తుండటం విశేషం.మాముళ్ల రాతతో కూడిన చిట్టా కాపీ ఫోరెన్సిక్ ల్యాబుకు పంపితే గాని అవినీతి అసలు రహస్యం తేలేటట్లు లేదని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
*మళ్లీ లీవ్ పొడిగింపు..బదిలీ వ్యూహమేనా..?*
గత 15 రోజులుగా వ్యక్తిగత కారణాలంటూ సెలవుపై ఉన్న సీఐ స్వప్న,వాస్తవానికి బుధవారంతో ముగిసి గురువారం రోజున తిరిగి విధుల్లో చేరాల్సి ఉందనే ప్రచారం జరిగింది.కానీ,అనూహ్యంగా జులై 09 గురువారం నాడు ఆమె తన లీవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించుకున్నట్లు ఆమె స్థానంలో ఇంచార్జిగా కొనసాగుతున్న ఎస్సై గంగాధర్ తెలిపారు.ఏసీబీ నిఘా తీవ్రంగా ఉన్న సమయంలో,అందునా శాఖలో ఇంత పెద్ద దుమారం రేగుతున్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన అధికారిణి పదే పదే విధులకు దూరం కావడంపై అందరిలో పలు రకాల తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయి.ఆమె అసలు తిరిగి విధుల్లో చేరుతుందా? లేదా అనే సందేహాలను ఎక్సైజ్ సిబ్బందే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.కాగా,తనపై వస్తున్న కథనాలు,ఏసీబీ భయంతోనే ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునేందుకు ఆమె ప్రయత్నాలు సాగిస్తున్నారని,బదిలీ అయ్యేంతవరకు విధుల్లో చేరకపోవచ్చనే పుకార్లు కూడా ఎక్సైజ్ వర్గాల్లో బలంగా షికార్లు చేస్తున్నాయి.

*శాఖ ప్రక్షాళనకు ప్రజల డిమాండ్*
ఏసీబీ దాడులు,ఉన్నతాధికారుల రిమాండ్లు,సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాముళ్ల చిట్టాలు,మహిళా సీఐ సుదీర్ఘ సెలవులు.వీటన్నింటినీ గమనిస్తున్న స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి,జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న పరిణామాలపై మరియు లీవుల వెనుక ఉన్న అసలు కారణాలపై సమగ్ర విచారణ జరిపించి ల్,శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని,శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.














Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *