ఇందూర్ కు పంగనామాలు పెడుతున్న సీఎం

ఇందూర్ కు పంగనామాలు పెడుతున్న సీఎం

పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్... ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమాయే..!! అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు పూర్తవుతాయి..? దేవుళ్ళ మీద ఒట్టు వేసి దేవుళ్లనే మోసం చేసినోడి కి ప్రజలను మోసం చేయడం లెక్క కాదు... ఏ మోఖం పెట్టుకొని జిల్లాలో పీసీసీ ప్రభుత్వ సలహాదారులు,రూరల్ ఎమ్మెల్యే తిరుగుతుండ్రు... ఇందూర్ ప్రజలను మోసం చేస్తే ఊరుకోరు... జిల్లా అభివృద్ధి కోసం ఉద్యమిస్తాం... ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు...   *కబురు న్యూస్,ఉమ్మడి జిల్లా బ్యూరో,మే

  • పచ్చి అబద్ధాలు చెబుతున్న రేవంత్…
  • ఔటర్ రింగ్ రోడ్ హామీ ఏమాయే..!!
  • అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు పూర్తవుతాయి..?
  • దేవుళ్ళ మీద ఒట్టు వేసి దేవుళ్లనే మోసం చేసినోడి కి ప్రజలను మోసం చేయడం లెక్క కాదు…
  • ఏ మోఖం పెట్టుకొని జిల్లాలో పీసీసీ ప్రభుత్వ సలహాదారులు,రూరల్ ఎమ్మెల్యే తిరుగుతుండ్రు…
  • ఇందూర్ ప్రజలను మోసం చేస్తే ఊరుకోరు…
  • జిల్లా అభివృద్ధి కోసం ఉద్యమిస్తాం…
  • ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరించారు…

 

*కబురు న్యూస్,ఉమ్మడి జిల్లా బ్యూరో,మే 18 :*

పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇందూర్ కు సీఎం రేవంత్ పంగనామాలు పెడుతుం డనీ ధర్మపురి అరవింద్ అన్నారు.అది చేస్తా..ఇది చేస్తానని..మాయ మాటలు చెప్పి దేవుళ్ళ మీద ఒట్టు వేసి దేవుళ్లనే మో సం చేసినోడీకి ప్రజలను మోసం చేయడం ఓ లెక్క కాదని ఎంపీ దుయ్యబట్టారు.సోమ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఎంపీ ధర్మపురి అర వింద్ మాట్లాడారు.ఇందూర్ కి ఔటర్ రింగ్ రోడ్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మరిచిండని మం డిపడ్డారు.టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని రాజకీ యంగా అనగదొక్కేందుకే జిల్లాకు సీఎం మొండి చేయిస్తున్నాడని అన్నారు.అబద్ధాలు ఆడుతూ సీఎం పబ్బం గడుపుతున్నాడని ఎంపీ విమర్శించారు.బుల్లెట్ రైల్ కారిడో విషయం లోను సీఎం అబద్దాలు మాట్లాడుతుండని ఎంపీ అన్నారు.అసలు జిల్లాలో ఏ మోఖం పెట్టుకొని పిసిసి,ప్రభుత్వ సలహాదారులు,రూరల్ ఎమ్మెల్యే ప్రజల్లో తిరుగుతుండ్రని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఔటర్ రింగ్ రోడ్లలోనూ కేంద్రం వాటా ఉందని తెలిపారు.గతంలో ఉన్న పట్టణాన్ని అప్గ్రేడ్ చేస్తానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ ను ప్రజలు గెస్ట్ హౌస్ లో కూర్చో పెట్టిందని ఎంపీ అన్నారు.ఇక లేని ఫ్యూచర్ సిటీని సీఎం రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎలా నమ్ము తారని ప్రశ్నించారు.2034 వరకు నేనే సీఎం అంటూ,రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని ఎంపీ ఎద్దేవా చేశారు.2039 దాకా రాహుల్ ప్రధాని కాలేడని రేవంత్ స్వ యంగా చెప్పారనీ ఎంపీ చెప్పారు.ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కల్ల బొల్లి మాయ మాటలు మాట్లాడడం మానుకోవాలని ఎంపీ హితవు పలికారు

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరంలో అండర్ గ్రౌం డ్ డ్రైనే జీ పనులు పూర్తి కావనీ ఎంపీ ఆగ్రహం వ్య క్తం చేశారు. ఇప్ప టివరకు సుమారు 25 శాతం మాత్రమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని ఎంపీ తెలిపారు. సుమారు రూ163 కోట్లకు గాను కాంగ్రెస్ ప్రభుత్వ రెండు సంవత్సరాల కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పను లకు సంబంధించి కేవలం రూ1 0 కోట్ల నిధులు మాత్రమే ఇవ్వ డం ఏమిటి అని ప్రశ్నించారు. ఇది ఇందూర్ పై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి అని… ప్రజలు గమనించాలని ఎంపి కోరారు. ఇందూర్ ప్రజలను మోసం చేస్తే ఊరుకోరని… జిల్లా అభివృద్ధికై నిధుల కోసం ఉద్యమిస్తామని ఎంపీ ఈ సందర్భంగా తెలిపా రు. వచ్చే ఎన్ని కల్లో తెలం గాణలో కాంగ్రెస్ కు ఘోర పరా జయం తప్పదనీ ఎంపీ అ న్నారు. 2029 ఎన్నికల్లో హై టెన్షన్ రాజకీయాలు ఉంటా యని ఎం పీ తెలిపారు. ఈ కార్యక్రమం లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ ,పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బిజెపి నాయ కులు తదితరులు పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!