వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి..బంగారం దోపిడి*

వాకిలి ఊడుస్తున్న మహిళపై దాడి..బంగారం దోపిడి*

*కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 11 :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ ఘటన శనివారం నగరంలోని దుబ్బా ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధిత మహిళ ప్రవీణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న వాకిలిని ఊడుస్తుండగా,గుర్తుతెలియని నలుగురు దుండగులు కారులో వచ్చారు.ఇద్దరూ ఆమెపై దాడి చేసి,గొంతు నులిమి,పొట్టపై కాలు పెట్టి,చీపిరితో కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం,అలాగే చెవి

*కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 11 :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ ఘటన శనివారం నగరంలోని దుబ్బా ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధిత మహిళ ప్రవీణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న వాకిలిని ఊడుస్తుండగా,గుర్తుతెలియని నలుగురు దుండగులు కారులో వచ్చారు.ఇద్దరూ ఆమెపై దాడి చేసి,గొంతు నులిమి,పొట్టపై కాలు పెట్టి,చీపిరితో కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం,అలాగే చెవి కమ్మలను చోరీ చేశారు.బాధిత మహిళ అరవడంతో ఇంటికి గడియ పెట్టి,కారులో పరారయ్యారు.దుండగులు ముఖానికి నల్లని ముసుగులు,చేతులకు గ్లౌజులు ధరించి దాడి చేసినట్లు బాధితురాలు తెలిపారు.వారి కారు కర్ణాటక పాసింగ్ గల నంబర్ ఉందని చెప్పారు.అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా,ఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్ ఎస్ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విషయం తెలుసుకున్న సిపి సాయి చైతన్య,ఏసిపి ప్రకాష్ యాదవ్,టౌన్ సీఐ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.బాధిత మహిళతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.అనుమానాస్పద వ్యక్తులు కాలనీలో సంచరిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సంబంధిత పోలీస్ స్టేషనుకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.ఇలా జిల్లా పలు చోట్ల బంగారం అపంహరించటానికి దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.చైన్ స్నాచింగులు కూడా పెరిగిపోతున్నాయి.ఈ నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నెమరపాటుతో ఉండకుండా ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తులను పసిగట్టి పోలీసులకు వెంటనే సమాచారామందించాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు..

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!