* యూనియన్ నేత చొరవతో సద్దుమణిగిన కలకలం.. * డీఎం విధానంతో పెరిగిన వివాదం..చివరకు సామరస్య పరిష్కారం.. * సిబ్బంది తరఫున క్షమాపణలు..ప్రయాణికుల గౌరవమే ముఖ్యమని స్పష్టీకరణ.. * ‘కబురు న్యూస్’ వరుస కథనాలతో స్పందించిన ఆర్టీసీ వర్గాలు.. కబురు న్యూస్,నిజామాబాద్/బాన్సువాడ,ఆగస్టు 23 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళా ప్రయాణికులకు గౌరవం, మర్యాదతో కూడిన సేవలు అందించాల్సిందేనన్న అంశంపై బాన్సువాడ ఆర్టీసీ డిపోలో తలెత్తిన వివాదానికి
- * యూనియన్ నేత చొరవతో సద్దుమణిగిన కలకలం..
- * డీఎం విధానంతో పెరిగిన వివాదం..చివరకు సామరస్య పరిష్కారం..
- * సిబ్బంది తరఫున క్షమాపణలు..ప్రయాణికుల గౌరవమే ముఖ్యమని స్పష్టీకరణ..
- * ‘కబురు న్యూస్’ వరుస కథనాలతో స్పందించిన ఆర్టీసీ వర్గాలు..
కబురు న్యూస్,నిజామాబాద్/బాన్సువాడ,ఆగస్టు 23 :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళా ప్రయాణికులకు గౌరవం, మర్యాదతో కూడిన సేవలు అందించాల్సిందేనన్న అంశంపై బాన్సువాడ ఆర్టీసీ డిపోలో తలెత్తిన వివాదానికి ఎట్టకేలకు సుఖాంతం లభించింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఎదురైన ఇబ్బందిపై ‘కబురు న్యూస్’ వరుస కథనాలు ప్రచురించడంతో ఈ వ్యవహారం ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలతో వివాదం మరింత ముదిరినట్లు అయ్యింది..ముఖ్యంగా బాన్సువాడ డిపో మేనేజర్ (డీఎం) రవికుమార్ తీసుకున్న నిర్ణయాలు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై చర్చ జరిగింది. మరోవైపు జేఏసీ పేరుతో వెలువడిన కరపత్రంలోని అంశాలు కూడా వివాదాన్ని మరింత చర్చలోకి తీసుకువచ్చాయి.
*వివాదానికి ముగింపు..ప్రయాణికురాలి గౌరవమే ముఖ్యం*
ఈ వ్యవహారం మరింత జటిలమవుతున్న సమయంలో ఆర్టీసీ యూనియన్‌కు చెందిన ఓ నాయకుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సమస్యను మరింత ముందుకు తీసుకెళ్లకుండా ఇరువర్గాలతో మాట్లాడి సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నించారు.‘కబురు న్యూస్’ ప్రతినిధితో ఆయన వినయపూర్వకంగా మాట్లాడి, సిబ్బంది–ప్రయాణికుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. సిబ్బంది వ్యవహారంపై విచారం వ్యక్తం చేస్తూ, ప్రయాణికులతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసినట్లు వాయిస్ రికార్డుల్లోని వివరాలు వెల్లడిస్తున్నాయి.అంతేకాకుండా ప్రయాణికురాలితో పాటు ‘కబురు న్యూస్’కు సిబ్బంది తరఫున క్షమాపణలు వ్యక్తం చేయడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
*చర్యలు కాదు.. మార్పే లక్ష్యం!*
ప్రయాణికుల పట్ల సిబ్బంది క్రమశిక్షణతో, గౌరవ మర్యాదలతో వ్యవహరించాలన్నదే ప్రధాన ఉద్దేశమని ‘కబురు న్యూస్’ స్పష్టం చేసింది. సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడం తమ లక్ష్యం కాదని, ప్రయాణికుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడటమే ముఖ్యమని పేర్కొంది.ఈ విషయంలో సానుకూలంగా స్పందించి వివాదానికి ముగింపు పలికేందుకు ఆర్టీసీ యూనియన్‌కు చెందిన ఆ నాయకుడు చొరవ తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
*సమయస్ఫూర్తి చాటిన యూనియన్ నాయకుడు*
వివాదం మరింత ముదరకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆర్టీసీ యూనియన్ నాయకుడిపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సంస్థ ప్రతిష్ఠ, మరోవైపు ప్రయాణికుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది.సిబ్బంది ఎంతటి పనిభారంలో ఉన్నప్పటికీ ప్రయాణికులతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న సందేశాన్ని ఆయన స్పష్టం చేశారు..
*‘మహాలక్ష్మి’ పథకం ఉద్దేశం..గౌరవంతో కూడిన ప్రయాణం*
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా, మహిళలు గౌరవంగా, భద్రతగా ప్రయాణించే వాతావరణాన్ని కల్పించాలన్నదే అసలు ఉద్దేశమని ఈ పరిణామం మరోసారి గుర్తుచేసింది.సిబ్బంద,ప్రయాణికుల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు ఇరువర్గాలు ముందుకు రావడంతో బాన్సువాడ ఆర్టీసీ ‘మహాలక్ష్మి’ వివాదానికి చివరకు సుఖాంతం లభించింది.


















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *