మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు..ఎస్ఐ అరెస్ట్… మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీ.. నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..కబురు న్యూస్,హన్మకొండ క్రైమ్,ఆగస్టు 01 :మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కదిరె శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆయనను నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోషల్
మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు..ఎస్ఐ అరెస్ట్…
మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా పరారీ..
నిజామాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..కబురు న్యూస్,హన్మకొండ క్రైమ్,ఆగస్టు 01 :మహిళలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) కదిరె శ్రీకాంత్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత మూడు నెలలుగా పోలీసులకు చిక్కకుండా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆయనను నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని వేధింపులకు పాల్పడినట్లు శ్రీకాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేశాడన్న ఫిర్యాదుతో గతంలో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనంతరం హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుల నేపథ్యంలో పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను నిజామాబాద్‌లో గుర్తించిన సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి హనుమకొండకు తరలించారు. అనంతరం హనుమకొండ మూడో అదనపు న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *