అర్బన్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ప్రగతి ప్రణాళిక జిల్లా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.. ఉమ్మడి జిల్లా బ్యూరో కబురు (న్యూస్) మే 22: ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారు లు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్ని
అర్బన్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…
ప్రగతి ప్రణాళిక జిల్లా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

ఉమ్మడి జిల్లా బ్యూరో కబురు (న్యూస్) మే 22:
ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అధికారు లు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్ని శాఖల అధికారులు అర్బన్ విషయంలో ప్రతి పథకంపై దృష్టి సారించాలని సూచించారు. నివేదికలు ఇస్తున్నారు కానీ 99 రోజుల్లో ఏం చేశారో చెప్పలేదన్నారు. ప్రతి శాఖ నివేదికలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో ప్రగతి మరోలా ఉంటుందన్నారు. నిజామాబాద్ అర్బన్ లో అనేక సమస్యలు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు . ప్రధానంగా నూతన బస్టాండ్ నిర్మాణం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కేటాయింపు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇలా అనేకం ఉన్నాయన్నారు. ముఖ్యంగా యూజీడీ వర్క్ నత్తనడకన కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో జరుగుతున్నంత వేగంగా అర్బన్ లో పథకాలు అందడం లేదన్నారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *