తెలంగాణలో రోడ్డు భద్రతకు కేంద్రం పెద్దపీట

నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్లు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్రం పటిష్టమైన చర్యలు ఎంపీ ధర్మపురి అరవింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట మైన చర్యలు చేపడు తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ తెలిపా రు. రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్ల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబం ధించి తాను

నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బ్లాక్ స్పాట్ల నివారణకు రూ.1,023 కోట్లు

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్రం పటిష్టమైన చర్యలు

ఎంపీ ధర్మపురి అరవింద్

WhatsApp Image 2026 07 23 at 12.36.04 PM

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)జూలై 23:

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట మైన చర్యలు చేపడు తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ తెలిపా రు. రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్ల నివారణ, రహదారి భద్రతా చర్యలకు సంబం ధించి తాను లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన సమాధానంలో కీలక వివరాలు వెల్లడయ్యాయ ని ఆయన తెలిపారు.తెలంగాణలో గత కొన్నే ళ్లలో ప్రమాదాల ఆధారం గా మొత్తం 1,513 యాక్సి డెంట్ బ్లాక్ స్పాట్లు గుర్తిం చగా, వాటిలో 1,308 బ్లాక్ స్పాట్లకు సంబంధిం చిన శాశ్వత నివారణ చర్యలు పూర్తయ్యాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడిం చిందని ఎంపీ అర్వింద్ తెలిపారు. మరో 205 బ్లాక్ స్పాట్లలో శాశ్వత నివారణ చర్యలు వివిధ దశల్లో కొనసాగుతు న్నాయని చెప్పారు.

నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ప్రత్యేక ప్రాధాన్యత

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 78 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, వాటిలో 75 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్త య్యాయని, మరో 3 ప్రాం తాల్లో చర్యలు వివిధ దశల్లో కొనసాగుతున్నా యని, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో మొత్తం 107 ప్రమాదకర బ్లాక్ స్పాట్లు గుర్తించగా, అందులో 99 ప్రాంతాల్లో నివారణ చర్యలు పూర్త య్యాయని, మరో 8 ప్రాం తాల్లో పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నా యని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఎంపీ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల భద్ర తకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమన్నారు.నిజామాబాద్ జిల్లాలో జాతీ య రహదారులపై రోడ్డు భద్రతను మరింత మెరు గుపరిచేందుకు అవసరమై న చర్యలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని, పెండిం గ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి తన వంతు కృషి కొనసాగుతుందని అర్వింద్ తెలిపారు.

NH-63, NH-61, NH-44పై రోడ్డు భద్రతా పనులు

నిజామాబాద్, జగిత్యాల జిల్లాల పరిధిలోని NH-6 3, NH-61, NH-44 జాతీ య రహదారులపై వంతె నలు, బైపాస్‌లు, రోడ్డు భద్రతా చర్యలతో కూడిన అభివృద్ధి పనులు వివిధ జాతీయ రహదారి అభి వృద్ధి కార్యక్రమాల కింద ప్రణాళిక, అమలు దశల్లో ఉన్నాయని కేంద్ర ప్రభు త్వం స్పష్టం చేసిందని అర్వింద్ తెలిపారు.

నిజామాబాద్ పార్ల మెంట్ పరిధిలో రోడ్డు భద్ర తకు కట్టుబడి ఉన్నాం

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రహదారులు, సురక్షితమైన ప్రయాణం అందించడమే తన ప్రధా న లక్ష్యమని ఎంపీ అర్వింద్ అన్నారు. ప్రమా దాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాశ్వత పరిష్కా రాలు చూపించేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేస్తామని తెలిపారు.
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో జాతీయ రహదా రుల అభివృద్ధి, బ్లాక్ స్పాట్ల నివారణ, వంతె నలు, బైపాస్‌లు, ఇతర రోడ్డు భద్రతా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1,023 కోట్లు కేటా యించిందని ఎంపీ అర్విం ద్ తెలిపారు. ప్రజల ప్రాణా లను కాపాడటమే లక్ష్యం గా రోడ్డు భద్రతా పనులను మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తా మని ఆయన స్పష్టం చేశారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos

Full Content News Scroll
usk1
usk2
usk3
usk4
usk5
usk6
usk1
usk2
usk3
usk4
usk5
usk6
error: Content is protected !!